కర్నె ప్రభాకర్‌ను తెలంగాణభవన్‌లోకి అనుమతించని పోలీసులు

V6 Velugu Posted on Oct 17, 2021

మాజీ ఎమ్మెల్సీ, టీఆర్ఎస్ సీనియర్ లీడర్ కర్నె ప్రభాకర్ కు అవమానం జరిగింది. లిస్టులో పేరు లేదంటూ తెలంగాణ భవన్ లోకి ఆయనను అనుమతించలేదు పోలీసులు. టీఆర్ఎస్ కార్యవర్గ సమావేశానికి ఆయన హాజరుకావాల్సి ఉంది. తాను ఎంత చెప్పిన పోలీసులు పట్టించుకోలేదు. తెలంగాణ భవన్ ఇంఛార్జ్ శ్రీనివాస్ రెడ్డికి కాల్ చేసినా ఆయన లిఫ్ట్ చేయకపోవడంతో చాలా సేపు గేట్ బయటే వెయిట్ చేశారు కర్నె ప్రభాకర్. తర్వాత లోపలి నుంచి వచ్చిన కొంత మంది ఆయనను రానివ్వాలని కోరడంతో పోలీసులు పర్మిషన్ ఇచ్చారు.

Tagged POLICE, Karne Prabhakar, , Telangana Bhavan, trsl leader

Latest Videos

Subscribe Now

More News