పీఆర్సీ రిపోర్ట్​ను లీక్​ చేసినోళ్లు దొరికిన్రు

పీఆర్సీ రిపోర్ట్​ను లీక్​ చేసినోళ్లు దొరికిన్రు

సీఎస్​కు చేరిన ఎంక్వైరీ రిపోర్ట్

హైదరాబాద్, వెలుగు: పీఆర్సీ కమిషన్ రిపోర్ట్ లీక్  చేసిన ఉద్యోగులను సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. ముందు సోషల్ మీడియా ద్వారా వివరాలను లీక్​ చేసినట్టు ఎంక్వైరీలో బయటపడింది. లీక్​ చేసిన ఉద్యోగుల డిపార్ట్​మెంట్, వాళ్లు ఉపయోగించిన ఫోన్​ నంబర్లు, ఎవరెవరికి అందించారు.. వంటి వివరాలతో రిపోర్ట్ తయారు చేశారు. దీనిని సైబర్ క్రైమ్స్ ఆఫీసర్లు సీఎస్ కు శనివారం అందచేసినట్లు తెలుస్తోంది. భవిష్యత్ లో ఇలాంటివి మళ్లీ జరగకుండా ఉండాలంటే సర్వీస్ రూల్స్ ప్రకారం చర్యలు తీసుకోవాల్సిందేనని సీనియర్​ ఆఫీసర్లు నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈనెల 26 న పీఆర్సీ నివేదిక బ్రీఫ్ రిపోర్ట్ ను సీఎస్ సోమేష్ కుమార్ యూనియన్ల లీడర్లకు పంపించారు. పీఆర్సీ కమిషన్ పూర్తి రిపోర్ట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. దీంతో సైబర్ క్రైమ్స్ పోలీసులు ఎంక్వైరీ చేశారు. కేవలం ఫిట్ మెంట్ శాతం బయటకు వస్తే ఇబ్బంది లేదని, ఉద్యోగాల ఖాళీలు, ప్రభుత్వ అప్పులు,  వడ్డీల వంటి సున్నితమైన వివరాలు లీక్​ కావడం వల్ల ప్రభుత్వ లోపాలు వెల్లడయ్యాయని యూనియన్ల లీడర్లు చెప్పారు.

For More News..

తల్లి శవాన్ని పదేళ్లు ఫ్రిజ్‌​లో దాచిన కూతురు

రాహుల్ వంట.. అదిరేనంట.. యూట్యూబ్ లో వీడియో వైరల్

వింత తీర్పుల జడ్జికి సుప్రీంకోర్టు షాక్‌‌