ఆటోలో డబ్బుల బ్యాగు మర్చిపోయిన్రు..

ఆటోలో డబ్బుల బ్యాగు మర్చిపోయిన్రు..

మెహిదీపట్నం వెలుగు: ఆటో ఎక్కిన ప్రయాణికులు అందులో రూ. లక్షన్నర డబ్బుల బ్యాగు మరిచిపోయారు. పోలీసులు అరగంటలో వెతికి పట్టుకుని బాధితులకు బ్యాగు అప్పగించారు. గుడిమల్కాపూర్  సీఐ రవి  తెలిపిన ప్రకారం..  ఏపీలోని టెక్కలి మదనపురం గ్రామానికి చెందిన సలానా దిలేశ్వరి, రవికుమార్ దంపతులు ఆదివారం ఉదయం మూసాపేట్ లో ఆటో ఎక్కి మెహిదీపట్నం మీదుగా గుడిమల్కాపూర్ లోని తమ బంధువుల ఇంటికి వెళ్లారు. 

ALSO READ :పురుగుల మందు తాగి భార్య..యాక్సిడెంట్‌‌లో భర్త మృతి

ఆటో దిగి అందులో రూ. లక్షన్నర డబ్బుల బ్యాగు మర్చిపోయారు. బంధువుల ఇంట్లోకి వెళ్లగా  డబ్బుల బ్యాగు కనిపించడం లేదు. వెంటనే గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్ లో  ఫిర్యాదు చేశారు.  సీసీ ఫుటేజ్ పరిశీలించి అరగంటలో ఆటో డ్రైవర్ ను పట్టుకున్నారు. డబ్బుల బ్యాగును బాధితులకు సీఐ రవి అందజేశారు.