
న్యూడ్ వీడియో కాల్స్‌తో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంను బ్లాక్ మెయిల్ చేసిన సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేశారు పోలీసులు. నిందితుల కోసం ప్రత్యేక టీంలను ఏర్పాటు చేశారు నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ . దర్యాప్తులో నిందితులు మధ్యప్రదేశ్‌కు చెందిన వారిగా గుర్తించారు. మధ్యప్రదేశ్ పోలీసుల సహకారంతో నిందితులను నకిరేకల్‌కు తీసుకొచ్చారు పోలీసులు. మార్చి 12న నిందితులను కోర్టులో ప్రవేశపెట్టనున్నారు
ఎమ్మెల్యే వేముల వీరేశం మార్చి4 రాత్రి తన ఆఫీస్‌లో అనుచరులతో మాట్లాడుతుండగా గుర్తు తెలియని నంబర్ నుంచి వాట్సప్‌లో వీడియో కాల్ వచ్చింది. ఎమ్మెల్యే ఫోన్ లిఫ్ట్ చేయగా అవతలివైపు ఓ అమ్మాయి నగ్నంగా కనిపించింది. దీంతో ఎమ్మెల్యే వెంటనే ఫోన్ కట్ చేశారు. అప్పటికే స్ర్కీన్ రికార్డు చేసిన సైబర్ నేరగాళ్లు ఆ వీడియోను ఎమ్మెల్యేకు పంపి డబ్బులు డిమాండ్ చేశారు. డబ్బులు ఇవ్వకపోతే వీడియోను కాంగ్రెస్ లీడర్లకు పంపడమే కాకుండా సోషల్ మీడియాలో వైరల్ చేస్తామని బెదిరించారు.
ALSO READ | పైటెక్ ఎంబెడెడ్ సిస్టమ్స్‌తో గీతం ఎంవోయూ
అయినా ఎమ్మెల్యే స్పందించకపోవడంతో సైబర్ నేరగాళ్లు వీడియో క్లిప్‌ను పలువురు కాంగ్రెస్ నేతలకు, కార్యకర్తలకు ఫార్వర్డ్ చేశారు. వీడియో చూసిన కొందరు విషయాన్ని ఎమ్మెల్యే వీరేశం దృష్టికి తీసుకురాగా ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల సలహాతో ఎమ్మెల్యే సైబర్ నేరగాళ్ల నంబర్‌ను బ్లాక్ చేశారు. సైబర్ నేరగాళ్లు మధ్యప్రదేశ్ నుంచి కాల్ నుంచి చేసినట్లు పోలీసులు గుర్తించారు. సైబర్ క్రైమ్ చట్టం ప్రకారం కేసు నమోదు చేసి, ప్రత్యేక టీమ్‌తో దర్యాప్తు చేసి నిందితులను పట్టుకున్నారు పోలీసులు.