
దేవాలయాలను టార్గెట్ చేస్తూ వరుస చోరీలు చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. పఠాన్ చెరు రుద్రారంలోని ఎల్లమ్మ టెంపుల్, చందానగర్, కూకట్ పల్లి పరిధిలోని ఆంజనేయ స్వామి , శివాలయంలో హుండీలు పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు. ఆటోను కిరాయికి తీసుకుని వరుసగా దొంగతనాలు చేస్తున్న వారిపై నిఘా పెట్టిన పోలీసులు సంగారెడ్డి జిల్లా పఠాన్ చెరులో అరెస్ట్ చేశారు. వారి నుంచి ఒక ఆటో,8 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. నిందితులు రుద్రారం గ్రామం ఒకే కుటుంబానికి చెందిన ఆంజనేయులు, గంగారాం సంజీవులు అనే వ్యక్తులిద్దరు మామా అల్లుళ్లుగా గుర్తించారు. వారిని రిమాండ్ కు తరలించినట్లు డీఎస్పీ రాజేశ్వర్ రావు తెలిపారు.