హాస్పిటల్ లో వీడియోలు తీసిన  వారిపై కేసులు

హాస్పిటల్ లో వీడియోలు తీసిన  వారిపై  కేసులు

సిద్దిపేట ప్రభుత్వాసుపత్రి  కరోనా ట్రీట్మెంట్  పరిస్థితులపై    వీడియో తీసిన  వారిపై పోలీసులు కేసులు పెట్టారు.  హాస్పిటల్ పై   దాడి చేసినట్టు,   డాక్టర్లు, ఇతర సిబ్బందిని  బూతులు తిట్టారనే ఆరోపణలతో   కేసు నమోదు  చేశామన్నారు పోలీసులు .హాస్పిటల్ పై దాడి ఘటనలను తీవ్రంగా పరిగణిస్తామన్నారు  సిద్దిపేట ఏసీపీ రామేశ్వర్.   సిద్దిపేట సాజిత్ పూరకు  చెందిన బిపాషా కరోనాతో   సిద్దిపేట హాస్పిటల్ లో  చేరారు. సిబ్బంది  ఎన్ని ప్రయత్నాలు  చేసినప్పటికి బిపాషా గురువారం  రాత్రి చనిపోయిందని చెప్పారు పోలీసులు.   దీంతో బిపాషా  కుమారుడు  మునీర్ అతని  బంధువులు హాస్పిటల్  డోర్లను  విరగ్గొట్టారని ఆరోపించారు పోలీసులు. విధుల్లో ఉన్న సిబ్బందితో  దురుసుగా ప్రవర్తించారని... డాక్టర్  చంద్రశేఖర్   పోలీసులకు ఫిర్యాదు  చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు  ఘటనపై  విచారణ చేస్తున్నారు.  

మరోవైపు ఇవాళ( శుక్రవారం) సిద్దిపేట ప్రభుత్వ  హాస్పిటల్ ను  సందర్శించారు బిజేపీ మహిళ  మోర్చా అధ్యక్షురాలు  అరుణారెడ్డి. కొవిడ్  వార్డులోని   పేషంట్లతో మాట్లాడారు. హాస్పిటల్ లోపల   పరిస్థితులు దారుణంగా  ఉన్నాయన్నారు. దీంతో అరుణను  అడ్డుకున్న డాక్టర్లు... పర్మిషన్  లేకుండా  పేషంట్లతో   మాట్లాడొద్దని సూచించారు. ఐతే ఇవాళ అరుణను అరెస్టు చేశారు   సిద్దిపేట పోలీసులు. హాస్పిటల్  సిబ్బందితో  దురుసుగా ప్రవర్తించారని కేసు నమోదు చేశారు.