జై భీం మూవీపై వివాదం.. సూర్య ఇంటికి పోలీసు భద్రత

జై భీం మూవీపై వివాదం.. సూర్య ఇంటికి పోలీసు భద్రత

చెన్నై: ప్రముఖ నటుడు సూర్య నటించిన జై భీం సినిమాపై వివాదం ముదురుతోంది. ఆయనపై దాడి చేసిన వారికి లక్ష రూపాయలు ఇస్తామని పట్టాలి మక్కల్ కట్చి నేత పళనిస్వామి ప్రకటించడంతో పోలీసులు మరింత అలర్ట్ అయ్యారు. చెన్నై టీ నగర్‌‌లోని సూర్య ఇంటి దగ్గర భద్రత కొనసాగిస్తున్నారు. ఇక సూర్యపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పళనిస్వామిపై వివిధ సెక్షన్ల కింద కేసులు పెట్టారు. కాగా, జై భీం సినిమాలో తమ సంఘం ప్రతిష్ట దిగజార్చారంటూ చిత్ర నిర్మాతలైన సూర్య, జ్యోతికతో పాటు దర్శకుడికి ఇప్పటికే వన్నియార్ సంఘం లీగల్ నోటీసులు పంపించారు. బహిరంగ క్షమాపణ చెప్పడమే కాకుండా రూ.5 కోట్ల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. వివిధ వర్గాల నుంచి బెదిరింపులు రావడంతో చెన్నైలోని సూర్య ఇంటి దగ్గర పోలీసులను మోహరించారు. తాజాగా పట్టాలి మక్కల్ కట్చి నేత పళనిస్వామి దాడి చేస్తామన్న హెచ్చరికలతో  భద్రత మరింత కట్టుదిట్టం చేశారు. 

మరిన్ని వార్తల కోసం: 

ఓయూ స్టూడెంట్స్ ఉన్న హాస్టల్‌లో ఎన్‌ఐఏ సోదాలు

లిక్కర్ నోటిఫికేషన్లు కాదు.. జాబ్ నోటిఫికేషన్లు ఇయ్యాలె

ఒకరిపై ఒకరు విమర్శలు ఆపి.. వడ్లు కొనుర్రి