కమాండ్​ కంట్రోల్ ​సెంటర్​లో పోలీస్ హెడ్‌‌‌‌క్వార్టర్స్‌‌‌‌!

కమాండ్​ కంట్రోల్ ​సెంటర్​లో పోలీస్ హెడ్‌‌‌‌క్వార్టర్స్‌‌‌‌!
  • డీజీపీ కార్యాలయం కూడా అక్కడే..
  • లక్డీకాపూల్‌‌‌‌లో సిటీ సీపీ ఆఫీసు 
  • డిసెంబర్‌‌‌‌‌‌‌‌లోగా తరలించేందుకు ఏర్పాట్లు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: బంజారాహిల్స్‌‌‌‌లోని ఇంటిగ్రేటెడ్‌‌‌‌ కమాండ్ అండ్ కంట్రోల్‌‌‌‌ సెంటర్‌‌‌‌(ఐసీసీసీ)‌‌‌‌లో భారీ మార్పులు జరుగనున్నాయి. పోలీస్ హెడ్‌‌‌‌క్వార్టర్స్‌‌‌‌ సహా ఇతర కీలక డిపార్ట్‌‌‌‌మెంట్స్‌‌‌‌ కమాండ్ కంట్రోల్ సెంటర్‌‌‌‌‌‌‌‌ నుంచే నిర్వహించేందుకు ప్రపోజల్స్ సిద్ధం అయినట్లు సమాచారం. హైదరాబాద్ సీపీ ఆఫీసును లక్డీకాపూల్‌‌‌‌లోని డీజీపీ ఆఫీస్‌‌‌‌కు తరలించేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిసింది. డీజీపీ ఆఫీస్‌‌‌‌ సహా అదనపు డీజీలు, ఐజీలు హెడ్‌‌‌‌ క్వార్టర్స్‌‌‌‌లోని  ఇతర సిబ్బంది కార్యాలయాలను కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌‌‌‌‌‌‌‌లోకి మార్చేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నారు. అన్ని అనుకూలంగా జరిగితే ఈ ఏడాది డిసెంబర్‌‌‌‌‌‌‌‌ నాటికి డీజీపీ, సిటీ పోలీస్ కమిషనర్‌‌‌‌‌‌‌‌ ఆఫీసులను తరలించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. 
ఈ మేరకు ఉన్నతాధికారులు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నారు.

కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌‌‌‌‌‌‌‌లో ఇప్పటికే సీఎం సమీక్షలు

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత సీఎం రేవంత్ రెడ్డి కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌‌‌‌‌‌‌‌ను పలుమార్లు సందర్శించారు. గ్రేటర్ హైదరాబాద్‌‌‌‌లోని మూడు కమిషనరేట్లు సహా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల పోలీస్ హెడ్‌‌‌‌ క్వార్టర్స్‌‌‌‌, కలెక్టర్ కార్యాలయాలు, ఇతర ముఖ్యమైన విభాగాల కనెక్టివిటీ గురించి తెలుసుకున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై ఐసీసీసీ నుంచే సమీక్షలు జరిపారు. దీంతో పాటు యాంటీ నార్కొటిక్స్‌‌‌‌ బ్యూరో, సైబర్ సెక్యూరిటీ బ్యూరోతో పలు సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాల్లో డిప్యూటీ సీఎం సహా మంత్రులు, పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అదే సమయంలో ఐసీసీసీ నుంచి ప్రజలకు ఎలాంటి సేవలు అందించవచ్చు అనే అంశాలపై చర్చించారు.

సిటీ మధ్యలో అందరికీ అందుబాలో సీపీ ఆఫీస్‌‌‌‌

సిటీ పోలీస్ కమిషనరేట్ బంజారాహిల్స్‌‌‌‌లో ఉండడంతో సామాన్యులకు ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. డీజీపీని కలిసేందుకు పోలీస్ అధికారులు, రాజకీయ ప్రముఖులు మినహా విజిటర్స్ సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. కానీ హైదరాబాద్ సీపీని కలిసేందుకు బాధితులు, సిటీజన్స్ పెద్ద సంఖ్యలో వస్తుంటారు.

తమ సమస్యలను సీపీకి విన్నవించేందుకు వచ్చే వారికి భ దూరం, ట్రాఫిక్ చిక్కులు కొంత ఇబ్బందిగా మారాయి. గతంలో బషీర్‌‌‌‌‌‌‌‌బాగ్‌‌‌‌లో సీపీ కార్యాలయం ఉండగా విజిటర్స్‌‌‌‌తో పాటు ఐదు జోన్ల డీసీపీలు, ఇతర సిబ్బందికి అనుకూలంగా ఉండేంది. సిటీ మధ్యలో ఉండడంతో ఎలాంటి కేసులోనైనా సరే పోలీసులకు అవసరమైన సదుపాయాలు అతి తక్కువ సమయంలో లభించేవి. ట్రాఫిక్‌‌‌‌లో టైమ్​వృథా కాకుండా ఉండేది.