
పోలీసుల ఉద్యోగాల నియమానికి సంబంధించిన ప్రాసెస్ ను తెలంగాణ పోలీసు రిక్రూట్ మెంట్ బోర్డు వేగవంతం చేసింది. ఇటీవల కానీస్టేబుల్స్, ఎస్సై పరీక్షలలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్ధులకు…. ఈ నెల 14 నుంచి 22 వరకు సర్టిపికేట్ వెరిపికేషన్ ఉంటుందని పోలీసు రిక్రూట్ మెంట్ బోర్డ్ తెలిపింది. దీనికి సంబంధించిన ఇంటిమేషన్ లేటర్ లను అభ్యర్దులు వ్యక్తిగతంగా… పోలీసు రిక్రూట్ మెంట్ బోర్డు సైట్ లో లాగిన్ అయ్యి తీసుకోవచ్చని తెలిపింది.
సర్టిపికేట్ వెరిపికేషన్ తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 17 సెంటర్లలో ఉంటుందని బోర్డు తెలిపింది. అదిలాబాద్, సైబరాబాద్, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నల్గొండ, నిజామాబాద్, రాచకొండ, రామగుండం, సంగారెడ్డి, సిద్దిపేట్, సూర్యాపేట్, వరంగల్ పోలీసు హెడ్ క్వార్టర్ లో సర్టిపికేట్ వెరిపికేషన్ ఉంటుంది.
వెరిఫికేషన్ కోసం అభ్యర్దులు ఏ ఏ సర్టిపికేట్స్ తమ వెంట తీసుకురావాలో అధికారిక TSLPRB వెబ్ సైట్ (https://www.tslprb.in/) లో లాగిన్ అయ్యి చూసుకునే వీలుంది. అభ్యర్దులు తమ వెంట ఓరిజినల్ సర్టిఫికేట్స్ తోపాటు సెల్ఫ్ అటెస్టెడ్ చేసిన కాపీలను కూడా తెచ్చుకోవాలని పోలీసు అధికారులు సూచించారు.