నడిరోడ్డు మీద మందు తాగుతూ పోలీస్ ఆఫీసర్ కొడుకు వీరంగం

నడిరోడ్డు మీద మందు తాగుతూ పోలీస్ ఆఫీసర్ కొడుకు వీరంగం

ఓ పోలీస్ ఆఫీసర్ కొడుకు నడిరోడ్డు మీద మందుతాగుతూ వీరంగం సృష్టించాడు. రోడ్డు పక్కనున్న సోడా బండిని ఢీకొట్టడమే కాకుండా.. ఇదేంటని ప్రశ్నించిన సోడా బండి యజమానిని చితకబాదాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి జరిగింది. మద్యం తాగుతూ డ్రైవ్ చేసిన ఆ యువకుడు.. అదుపుతప్పి ఇన్నోవా కారుతో సోడా బండిని ఢీకొట్టాడు. ఆ ఇన్నోవా కారు మీద పోలీస్ అనే స్టిక్కర్ కూడా ఉంది. ఈ వాహనంపై రెండు సార్లు ఓవర్ స్పీడ్, డేంజరస్ డ్రైవింగ్ పై చలాన్లు కూడా ఉన్నాయి. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకొని పోలీసులు కేసు నమోదు చేశారు.

https://www.youtube.com/watch?v=25zm7eNwFy0