కారు డోర్ వల్ల ప్రమాదం.. వీడియోతో డ్రైవర్లకు డీసీపీ మెస్సేజ్

కారు డోర్ వల్ల ప్రమాదం.. వీడియోతో డ్రైవర్లకు డీసీపీ మెస్సేజ్

కారు డ్రైవర్ నిర్లక్ష్యం బైక్పై వస్తున్న వారికి శాపంగా మారింది. ఒక్కసారిగా కారు డోర్ తెరవడంతో బైక్ వస్తున్న వ్యక్తులు ప్రమాదానికి గురయ్యారు. బెంగళూరు ఈస్ట్ డివిజన్ ట్రాఫిక్ డీసీపీ కళా కృష్ణస్వామి ఈ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోలో డ్రైవర్ కారును రోడ్డుపై ఆపి డోర్ ఓపెన్ చేస్తాడు.. ఆ కారు పక్కగా వెళ్తున్న బైక్ కు ఈ డోర్ తగలడంతో అదుపుతప్పి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. దీంతో బైక్ మీదున్న ఇద్దరు వ్యక్తులకు గాయాలయ్యాయి. 

ఈ ఘటన 2017లో జరగ్గా..రోడ్డు ప్రమాదాల నేపథ్యంలో వాహనదారులను హెచ్చరించేందుకు డీసీపీ కళా కృష్ణస్వామి ఈ వీడియోను పోస్ట్ చేశారు. ‘‘దయచేసి మీరు మీ వాహనం డోర్ తెరిచినప్పుడు అప్రమత్తంగా ఉండండి. ప్రాణాంతక ప్రమాదాలను నివారించండి’’ అని క్యాప్షన్ పెట్టారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్మీడియాలో వైరల్గా మారింది.