భారీ బందోబస్తు మధ్య నాంపల్లి కోర్టుకు రాజాసింగ్

భారీ బందోబస్తు మధ్య నాంపల్లి కోర్టుకు రాజాసింగ్

హైదరాబాద్: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ను నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. భారీ బందోబస్తు మధ్య బొల్లారం పోలీసు స్టేషన్ నుంచి నాంపల్లి కోర్టుకు తరలించారు. నాంపల్లి కోర్టు పరిసరాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నిన్న రాత్రి నుంచి ఓ వర్గం వారి ఆందోళనలు, ఫిర్యాదుల నేపథ్యంలో పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. 

రాజాసింగ్ అప్ లోడ్ చేసిన ఓ వీడియో వివాదాస్పదం కావడంతో నిన్న రాత్రి నుంచి ఓ వర్గం వారు సిటీ పోలీసు కమిషనర్ కార్యాలయంతోపాటు భవానీ నగర్, డబీర్ పురా, రెయిన్ బజార్ పోలీస్ స్టేషన్ల ముందు పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేశారు. అంతేకాదు ఫిర్యాదులు కూడా చేయడంతో పోలీసులు స్పందించారు. కేసు నమోదు చేసి రాజాసింగ్ ఇంటికెళ్లి అరెస్టు చేసి బొల్లారం పోలీసు స్టేషన్ కు తరలించారు. సాయంత్రం  4 గంటల తర్వాత నాంపల్లి కోర్టుకు తీసుకొచ్చారు. 

వివాదాస్పద వ్యాఖ్యల కేసులో అరెస్టయిన ఎమ్మెల్యే రాజాసింగ్ నాంపల్లి కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఇరువైపులా వాదనలు జరుగుతున్నాయి. కాసేపట్లో తీర్పు వచ్చే అవకాశం ఉంది. 

ఎమ్మెల్యే రాజాసింగ్ పై నమోదైన కేసులు

  • IPC సెక్షన్ 153(a) మతాల మద్య, కులాల మద్య చిచ్చుపెట్టి  విద్వేషాలు రెచ్చగొట్టడం
  • 295 (a )మత విశ్వాసాలను కించపరచటం
  • 505(1) (2)ప్రకటనద్వారా నష్టం కలిగించడం
  • ఐపిసి సెక్షన్ 506 బెదిరింపులకు పాల్పడటం