హైదరాబాద్‌లో నకిలీ మెడిసిన్ తయారీ కేంద్రంపై పోలీసుల దాడి

హైదరాబాద్‌లో నకిలీ మెడిసిన్ తయారీ కేంద్రంపై పోలీసుల దాడి

కుత్బుల్లాపూర్: పేట్ బాషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిదిలోని దూలపల్లిలో నకిలిమందుల తయారీ కేంద్రంపై ఎస్ఓటి మేడ్చల్, డ్రగ్ కంట్రోల్,పేట్ బాషీరాబాద్ పోలీసుల దాడి చేశారు. గత ఆరు నెలలగా ప్రముఖ కంపెనీల పేరుతో, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ లలో ఉండే ఫార్మా కంపెనీ ల పేర్లతో నకిలీ మందులు తయారు చేసి విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా గుర్తించారు పోలీసులు. 

వారి వద్ద నుండి రూ.50లక్షల విలువ చేసే నకీలీ మందులు, మిషనరీని  స్వాధీనం చేసుకున్నారు. నకిలీ మందుల తయారీ కేంద్రం నిర్వహిస్తున్న గోపాల్(42), రామక్రిష్ణ(40) అనే నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. వీరితో పాటు డిల్లీ స్థావరంగా నకీలీ మందులను దేశవ్యాప్తంగా సప్లై చేస్తున్న నిహల్ అనే ప్రధాన నిందితుడి పరారీలో ఉన్నట్లుగా పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా మేడ్చల్ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీసీపీ కోటి రెడ్డి,డ్రగ్ కంట్రోల్ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి వివరాలు వెల్లడించారు.