గడ్డి కోస్తుండగా ఉంగరం పోగొట్టుకున్న ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ..నిమిషాల్లో వెతికిపెట్టిన పోలీసులు

గడ్డి కోస్తుండగా ఉంగరం పోగొట్టుకున్న ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ..నిమిషాల్లో వెతికిపెట్టిన పోలీసులు

తన వ్యవసాయ క్షేత్రంలో బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ గడ్డి కోస్తూ పోగొట్టుకున్న ఉంగరాన్ని  పోలీసులు వెతికిపెట్టారు. మేడ్చల్ జిల్లా కీసర మండలం రాంపల్లి దాయరా పరిధిలో ఉన్న వ్యవసాయ క్షేత్రానికి ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ వెళ్లారు. పచ్చి గడ్డి కోస్తుండగా  నవరత్నాల ఉంగరం పోయింది. అయితే ఈ విషయాన్ని ప్రభాకర్ రాచకొండ సీపీకి తెలియజేశారు. దీనిపై స్పందించిన రాచకొండ సీపీ... ప్రత్యేక బృందంతో పాటు డాగ్ స్క్వాడ్ ను కూడా పంపారు. ప్రభాకర్ వ్యవసాయ క్షేత్రానికి వెళ్లిన సిబ్బంది..క్షుణ్ణంగా పరిశీలించారు. ఉంగరం కోసం తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలోనే ఉంగరాన్ని వెతికిపెట్టారు. పోగొట్టుకున్న ఉంగరాన్ని వెతికి పెట్టిన పోలీసులకు, సీపీ మహేష్​  భగవత్ కు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు. 

నా వ్యవసాయ క్షేత్రంలో పచ్చి గడ్డి కోస్తుండగా నవరత్నాల ఉంగరం పోయింది. ఈ విషయాన్ని రాచకొండ సీపీకి తెలియజేస్తే ఉన్నత స్థాయి సాంకేతిక బృందాన్ని పంపించారు. నిమిషాల మీద వారు పరిశీలించి ఉంగరాన్ని వెలికి తీశారు. పోలీసులకు ధన్యవాదాలు.  అంటూ ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ట్వీట్ చేశారు .