హైట్లో క్వాలిఫై కానివారికి మళ్లీ ఛాన్స్

హైట్లో క్వాలిఫై కానివారికి మళ్లీ ఛాన్స్

హైట్ విషయంలో కొద్దిలో ఛాన్స్ మిస్సైన ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు సంబంధించి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు కీలక ప్రకటన చేసింది. హై కోర్టు ఆదేశాల మేరకు ఒక సెంటీమీటర్, ఆ లోపు హైట్ తక్కువుండి అర్హత కోల్పోయిన అభ్యర్థులకు మరోసారి హైట్ మెజర్మెంట్ టెస్ట్ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. హైదరాబాద్  అంబర్ పేటలోని స్పెషల్ ఆర్మ్డ్ రిజర్వ్ సిటీ పోలీస్ లైన్స్తో పాటు రంగారెడ్డి జిల్లా కొండాపూర్ లోని 8వ బెటాలియన్ లో ఈ పరీక్ష నిర్వహించనున్నట్లు రిక్రూట్మెంట్ బోర్డు ప్రకటించింది. దీనికి హాజరుకావాలనుకునే అభ్యర్థులు ఫిబ్రవరి10వ తేదీ ఉదయం 8 గంటల నుంచి 12ల తేదీ రాత్రి 8 గంటల వరకు www.tslprb.in  వైబ్సైట్లో లాగినై ఆన్ లైన్లో అప్లికేషన్లు సమర్పించాలని స్పష్టం చేసింది. టెస్టుకు హాజరయ్యే అభ్యర్థులు రీ మెజర్మెంట్కు సంబంధించిన అప్లికేషన్ కం అడ్మిట్ కార్డ్ను వెంట తీసుకురావాలని లేనిపక్షంలో టెస్ట్కు అనుమతించమని బోర్టు తేల్చి చెప్పింది.