కుమారి ఆంటీ ఫుడ్ కోర్ట్ ఎత్తేశారు.. కారణం ఎవరు.. ఎందుకిలా జరిగింది..

కుమారి ఆంటీ ఫుడ్ కోర్ట్ ఎత్తేశారు.. కారణం ఎవరు.. ఎందుకిలా జరిగింది..

 సోషల్ మీడియా స్టార్ స్ట్రీట్ ఫుడ్ కుమారి ఆంటీ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆమెకు ఉన్న క్రేజ్ మరే ఫుడ్ స్టాల్ కు లేదు. యూట్యూబ్ నుంచి ఇన్ స్టాగ్రామ్ దాక మాదాపూర్ నుంచి హైటెక్ సిటీ దాక కుమారి ఆంటీ అంటే తెలియని వారు లేరు. ఆమె షాప్ అడ్రెస్ అడిగితే చెప్పాని వారు ఉండరు. జనం మదిలో మంచి స్థానాన్ని సంపాదించి ఫుడ్ కోర్టును రన్ చేస్తుంది. ఈ క్రమంలోనే కుమారి ఆంటీ పై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. అయ్యో ఆంటీ అందరికి  అమ్మా..! నాన్న..! అంటూ భోజనం వడ్డిస్తుంది తన పై కేసేంటి అని అనుకుంటున్నారు కదా..  అయితే మొత్తం చదవండి..
 
కేసు ఎందుకు నమోదైందంటే..!
 
కుమారి ఆంటీ దగ్గర భోజనం చేయడానికి జనం ఎగబడుతుండటం గమనించిన కొందరు ఫుడ్ వ్లాగర్స్.. ఆమెపై వీడియోలు తీసి పెట్టటంతో.. సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం మొదలు పెట్టారు. దీంతో ఆంటీ ఫుడ్ కోర్ట్ తెగ వైరల్ అయ్యింది. సినీ తారలు సైతం ప్రమోషన్స్ కోసం ఆంటీ వద్దకు వస్తుండటంతో మరింత క్రేజ్ చేకూరింది. దీంతో ఆంటీ వద్ద భోజనం చేసేందుకు యువత ఎక్కువగా ఆసక్తి చూపారు. రోడ్డుపైనే వాహనాలు పార్క్ చేసి భోజనం చేసేందుకు వెళ్తున్నారు. దీంతో ఐటీసీ కోహినూరు రోడ్డు మొత్తం ట్రాఫీక్ జాం అవుతుంది. ఇంకేముంది.. ట్రాఫిక్ జాంకు కారణమైన కుమారి ఆంటీపై పోలీసులు కేసు నమోదు చేశారు.

నాకు న్యాయం చేయాలి..

పోలీసులు తన స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ క్లోజ్ చేయడంతో కుమారి ఆంటీ కన్నీరు మున్నీరు అయ్యారు. మీడియా వాళ్లే నాకు ఇంత పేరొచ్చింది. ఇప్పుడు కూడా మీడియానే తనకు న్యాయం చేయాలని ఆంటీ కోరారు. ట్రాఫిక్‌కు ఆటంకం కలిగించొద్దంటూ తన దగ్గరకు భోజనం చేసేందుకు వచ్చే ప్రతి ఒక్కరికీ చెబుతూనే ఉన్నానని తనతో పాటు ఇక్కడ చాలామంది స్ట్రీట్‌ ఫుడ్‌ బిజినెస్‌ రన్‌ చేస్తురని కానీ పోలీసులు తన స్టాల్‌ను మాత్రమే క్లోజ్‌ చేయాలని చెప్పారని తెలిపారు. తనకు తగిన న్యాయం జరగాలని కుమారి ఆంటీ కోరారు. 

న్యాయం కాదు : సందీప్ కిషన్

కుమారీ ఆంటీ పై కేసు నమోదు కావడాన్ని హీరో సందీప్ కిషన్ తప్పుబట్టారు.  "ఇది అసలు న్యాయం కాదు. సొంతంగా వ్యాపారం ప్రారంభించి కుటుంబానికి మద్దతుగా నిలిచేందుకు చాలా మంది మహిళలకు ఆమె స్ఫూర్తిగా మారుతున్నారు. ఇటీవలి కాలంలో మహిళా సాధికారితకు నేను చూసిన ఉదాహరణ ఆమె. నేను, నా టీమ్ ఆమెతో మాట్లాడతాం. ఆమెకు వీలైనంత మేర సాయం చేస్తాం” అని సందీప్ కిషన్ ట్వీట్ చేశారు. కొన్ని రోజుల క్రితమే సందీప్ కిషన్ కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ ను సందర్శించిన విషయం తెలిసిందే.