ఎందుకురా.. జనాల ప్రాణాలతో ఆడుకుంటారు..ఇంటర్‌‌ ఫెయిల్‌‌ అయి.. హాస్పిటల్‌‌ నడుపుతున్నరు

ఎందుకురా.. జనాల ప్రాణాలతో ఆడుకుంటారు..ఇంటర్‌‌ ఫెయిల్‌‌ అయి.. హాస్పిటల్‌‌ నడుపుతున్నరు

మరో వ్యక్తి చదివింది ల్యాబ్‌‌టెక్నీషియన్‌‌.. చేస్తోంది డాక్టర్‌‌ పని
వరంగల్‌‌లో ఇద్దరిపై కేసు నమోదు చేసిన టీజీఎంసీ టీమ్‌‌

వరంగల్‍ / కాజీపేట : ఇంటర్‌‌ ఫెయిల్‌‌ అయిన ఓ వ్యక్తి.. ల్యాబ్‌‌టెక్నీషియన్‌‌ చదివిన మరో యువకుడు డాక్టర్ల అవతారం ఎత్తారు. తమ వద్దకు వచ్చిన రోగులకు ఇష్టారీతిన యాంటీబయాటిక్స్‌‌, స్టెరాయిడ్స్‌‌ ఇస్తూ ట్రీట్‌‌మెంట్‌‌ చేస్తున్నారు. ఈ విషయం మెడికల్‌‌ ఆఫీసర్లకు తెలియడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు.

 వివరాల్లోకి వెళ్తే... హనుమకొండ జిల్లా మడికొండకు చెందిన టి. రాజు ఇంటర్‌‌ ఫెయిల్‌‌ అయ్యాడు. తర్వాత అక్కడే శ్రీజ క్లినిక్‌‌ పేరుతో ఫేక్‌‌ రిజిస్ట్రేషన్‌‌ నంబర్‌‌ ద్వారా ఓ హాస్పిటల్‌‌ను ఓపెన్‌‌ చేసి.. డాక్టర్‌‌గా చలామణి అవుతూ తన వద్దకు వచ్చిన పేషెంట్లకు ట్రీట్‌‌మెంట్‌‌ చేస్తున్నాడు. అలాగే ఇదే ప్రాంతానికి చెందిన జయరాం అనే యువకుడు ల్యాబ్‌‌ టెక్నీషియన్‌‌ కోర్సు పూర్తి చేశాడు. ఇతడి భార్య భాగ్యలక్ష్మితో కలిసి సాయిశ్రీ ఫస్ట్‌‌ ఎయిడ్‌‌ సెంటర్‌‌ పేరుతో ఓ హాస్పిటల్‌‌ను నడిపిస్తున్నాడు.

 వీరి విషయం తెలుసుకున్న మెడికల్‌‌ కౌన్సిల్‌‌ టీమ్‌‌ సభ్యులు శుక్రవారం రెండు హాస్పిటల్స్‌‌లో తనిఖీలు చేపట్టి యాంటీ బయాటిక్స్‌‌, స్టెరాయిడ్స్‌‌, మలేరియా ఇంజక్షన్లను స్వాధీనం చేసుకున్నారు. అర్హత లేకుండా హాస్పిటల్స్‌‌ నడుపుతున్న వారిపై కేసులు నమోదు చేసినట్లు టీజీఎంసీ మెంబర్‌‌ డాక్టర్‍ నరేశ్‌‌ చెప్పారు. తనిఖీల్లో హెల్త్‌‌ కేర్‌‌ రిఫార్మ్స్‌‌ డాక్టర్స్‌‌ అసొసియేషన్‌‌ వరంగల్‌‌ జిల్లా అధ్యక్షుడు కె.వెంకటస్వామి పాల్గొన్నారు.