
దేశంలోని వీధి వ్యాపారుల కోసం ప్రధాని మోదీ తన రెండవ పదవీ కాలంలో పీఎం స్వనిధి యోజనను ప్రవేశపెట్టారు. ఇది పేద వర్గాలకు కరోనా కాలంలో రోజువారీ వ్యాపార అవసరాలకు రుణాలను అందించేందుకు తీసుకురాబడింది.
ఈ స్కీమ్ కింద రూ.50వేల వరకు ఎలాంటి హామీ లేకుండా రుణాలను వీధి వ్యాపారులకు అందిస్తున్నారు. అయితే తాజాగా ఈ పథకంలో కీలక మార్పులను తీసుకొస్తున్నారు. పీఎం స్వనిధి యోజన 2.0 కింద అర్హులకు ఇకపై యూపీఐ లింక్డ్ క్రెడిట్ కార్డులను అందించనున్నారు. ఇది త్వరలోనే ప్రారంభం కానున్నట్లు సమాచారం.
ALSO READ | UPI News: షాకింగ్.. లైఫ్ లాంగ్ యూపీఐ ఫ్రీ కాదు.. తేల్చి చెప్పేసిన RBI గవర్నర్..!
స్కీమ్ 2.0 కింద చిన్న వీధి వ్యాపారులకు 7% వార్షిక వడ్డీ సబ్సిడీతో రూ. 50వేల వరకు రుణంతో పాటు రూ. 30వేల పరిమితితో యూపీఐ- లింక్డ్ క్రెడిట్ కార్డులను అందించనున్నారు. మార్చి 31, 2025 వరకు 68 లక్షల మంది వీధి వ్యాపారులు ఈ స్కీమ్ ద్వారా మొత్తం రూ.13వేల 792 కోట్ల విలువైన రుణాలు అందుకున్నారు. స్కీమ్ తొలుత వర్కింగ్ క్యాపిటల్ అవసరాల కోసం రూ.10వేలు ఇస్తుంది. దీనిని సకాలంలో చెల్లించిన వారికి రూ.20వేల నుంచి రూ.50వేల వరకు అందిస్థాయి ఆర్థిక సంస్థలు.
స్కీమ్ కూరగాయలు, పండ్లు, రెడీమేడ్ స్ట్రీట్ ఫుడ్స్, టీ, పకోడాలు, బ్రెడ్, గుడ్లు, వస్త్రాలు, దుస్తులు, పాదరక్షలు, చేతివృత్తుల ఉత్పత్తులు, స్టేషనరీ మొదలైన వ్యాపారాలు చేసే వారికి ప్రయోజనకరం. వీటికి తో డు చెప్పులు కుట్టేవారు, పాన్ షాపులు, లాండ్రీ సేవలు అందించే వ్యాపారులకు కూడా ప్రయోజనం కలిగిస్తోంది పీఎం స్వనిధి.