బండి సంజయ్ పై మొత్తం 10 కేసులు

బండి సంజయ్ పై మొత్తం 10 కేసులు

పాత కేసులను కూడా కలిపి బండి సంజయ్ పై రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు పోలీసులు. నిన్న నమోదైన కేసుతో పాటు మొత్తం 10 కేసులను  చూపించారు. కరీంనగర్ టూ టౌన్ లో 2012లో ఒకే కేసులో 4 సెక్షన్లు నమోదు చేశారు పోలీసులు. సిరిసిల్ల టౌన్ లో 2017లో ఒక కేసులో ఐదు సెక్షన్లు, ఇదే స్టేషన్ లో మరో కేసులో ఏడు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 2018లో కరీంనగర్ టూ టౌన్ లో ఒకే కేసులో ఆరు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కరీంనగర్ వన్ టౌన్ లో మూడు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అదే ఏడాది.. టూ టౌన్ లో రెండు సెక్షన్ల కింద మరో కేసు నమోదు అయింది. 2019లో బోయిన్ పల్లి పీఎస్ లో ఒకటి, మల్యాల పీఎస్ లో మరో కేసు నమోదు అయింది. 2019లో కరీంనగర్ లో రూరల్ పీఎస్ లో నాలుగు సెక్షన్ల కింద మరో కేసు నమోదైంది. ఇక నిన్నటి కేసుకు సంబంధించి.. డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ సహా.. మూడు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ఇవన్నీ సంజయ్ రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు పోలీసులు.