పురుగుల మందు తాగిన వ్యక్తిని కాపాడిన పోలీస్

పురుగుల మందు తాగిన వ్యక్తిని కాపాడిన పోలీస్

పురుగుల మందు తాగిన వ్యక్తిని ఓ పోలీస్ కాపాడాడు. కరీంనగర్ జిల్లా  వీణవంక మండలంలోని బేతిగల్ గ్రామంలో పురుగుల మందు తాగిన.. సురేష్ ను ప్రాణాపాయం నుంచి బ్లూ కోర్టు పోలీస్ జైపాల్ కాపాడారు. ఇంటిలో జరిగిన చిన్న గొడవతో గ్రామ శివారులోని పంట పొలాల్లో సురేష్ పురుగుల మందు తాగాడు. దీంతో కుటుంబ సభ్యులు 100  డయల్ చేసి సమాచారం అందించారు.

దీంతో వెంటనే స్పందించిన బ్లూ కోట్ సిబ్బంది.. ఘటన స్థలానికి చేరుకున్నారు. అక్కడికి వెళ్లిన పోలీస్ జైపాల్ భుజాలపై ఎత్తుకొని రెండు కిలోమీటర్ల మేర పంట పొలాల నుంచి తీసుకువచ్చి ఆస్పత్రికి తీసుకెళ్లాడు. సకాలంలో స్పందించి ప్రాణాలు కాపాడిన బ్లూకోట్ పోలీస్ జైపాల్ ను ఎస్ఐ వంశీకృష్ణ అభినందించారు.