బూర్గంపహాడ్ లో 15 కేజీల గంజాయి పట్టివేత

బూర్గంపహాడ్ లో 15 కేజీల గంజాయి పట్టివేత

బూర్గంపహాడ్,వెలుగు: బైక్​ అదుపుతప్పి పడిపోయిన వ్యక్తి నుంచి 15 కేజీల గంజాయిని  పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన మండలంలోని సారపాకలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు... ఏపీ లోని జగ్గయ్యపేట మండలానికి చెందిన కన్నెగంటి ఈశ్వర్ గోపీనాథ్, గూటి నాగరాజు భద్రాచలం నుంచి సారపాక వైపు స్కూటీపై వస్తున్నారు. 

ఈ క్రమంలో పోలీసులను చూసి వేగంగా వాహనాన్ని నడిపే క్రమంలో స్కూటీ అదుపుతప్పి పడిపోయింది. దీంతో వెనుక కూర్చున్న గూటి నాగరాజు పారిపోవడంతో అనుమానంతో వాహనంపై బ్యాగులను తనిఖీ చేయగా రూ.7,65,00 విలువగల 15 కేజీల గంజాయి  పట్టుబడింది.

 గాయాలతో పట్టుబడ్డ  ఈశ్వర్ గోపీనాథ్ ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా  సీలేరు వైపు నుంచి  జగ్గయ్యపేటకు గంజాయిని తరలిస్తునట్లుగా ఒప్పున్నాడు.  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.