నర్సాపూర్, వెలుగు : అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న లారీని పోలీసులు పట్టుకున్న ఘటన బుధవారం జరిగింది. ఎస్ఐ రంజిత్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం, హైదరాబాద్ నుండి మహారాష్ట్రకు 305 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని లారీలో తరలిస్తున్నట్టు మంగళవారం ఉదయం 3.30 గంటల సమయంలో సమాచారం అందింది. ఈ మేరకు నర్సాపూర్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు.
విజిలెన్స్ అధికారులు వేరే మార్గంలో వెంబడిస్తున్నట్టు తెలుసుకున్న నేరస్థులు నర్సాపూర్ మార్గంలోకి మళ్లారు. ఈ నేపథ్యంలో నర్సాపూర్ పట్టణంలోకి లారీ ప్రవేశించగానే ఎస్ఐ రంజిత్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు దాన్ని అడ్డుకున్నారు. లారీ డ్రైవర్, క్లీనర్‌లను అదుపులోకి తీసుకుని, 305 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ అధికారులకు అప్పగించారు.
