ఏపీ తాడిపత్రిలో రూ. కోటి 30 లక్షలు పట్టివేత

ఏపీ తాడిపత్రిలో రూ. కోటి 30 లక్షలు పట్టివేత

అనంతపురం జిల్లాలో భారీగా నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తాడిపత్రి బస్ స్టాప్ దగ్గర అనుమానస్పదంగా తిరుగుతున్న ముగ్గురు వ్యక్తులను పట్టుకోగా.. వారి వద్ద రూ. కోటి 30 లక్షల నగదు దొరికిందని పోలీసులు తెలిపారు. ఈ నగదుకు సంబంధించి ఎలాంటి రశీదులు లేవని.. అయితే ఈ నగదును ఎందుకు? ఎక్కడకు తీసుకెళుతున్నారో వాళ్లు చెప్పడం లేదని, విచారణలో అన్ని విషయాలు తెలుస్తాయని పోలీసులు తెలిపారు. పట్టుబడిన నగదును ఎన్నికల అధికారులకు అప్పగిస్తామని పేర్కొన్నారు.

సరైన పత్రాలు చూపించి నగదును తీసుకెళ్లవచ్చని.. పట్టుబడిన ముగ్గురినీ తాడిపత్రి పోలీసులు విచారణ జరుపుతున్నారు. తాడిపత్రి ఆర్టీసీ బస్టాండ్ వద్ద అనుమానస్పదంగా మస్తాన్ వలితో పాటు ఇద్దరు మహిళలు కనిపించడంతో వారిని సోదాలు చేయగా ఈ సొమ్మును స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు.