ఏపీ టీడీపీ నేత ఇంటికెళ్లిన తెలంగాణ పోలీసులు.. నోటీసులిచ్చే లోపే పరార్

ఏపీ టీడీపీ నేత ఇంటికెళ్లిన తెలంగాణ పోలీసులు.. నోటీసులిచ్చే లోపే పరార్

భూ వివాదం కేసులో  నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం అల్లూరులో టీడీపీ నేత, మాజీ  ఐపీఎస్  అధికారి మాండ్ర శివానందరెడ్డి ఇంటికి వెళ్లారు తెలంగాణ పోలీసులు.   తమతో విచారణకు రావాలని  పోలీసులు కోరగా..  నోటీసులివ్వాలని  శివానందరెడ్డి  అడిగాడు. దీంతో  పోలీసులు నోటీసులు  తయారు చేస్తుండగా.. కారు ఎక్కి అక్కడి నుంచి  పరారయ్యిండు శివానందరెడ్డి.

 పోలీసులు అడ్డుకోవడానికి ప్రయత్నించగా తప్పించుకుని పారిపోయినట్లు తెలుస్తోంది.   శివానందరెడ్డిపై  నల్గొండ, హైదరాబాద్ ప్రాంతాల్లో భూకబ్జాలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. హైదరాబాద్ గచ్చిబౌలిలోని భూకబ్జా కేసులో శివానందరెడ్డిని  అరెస్ట్ చేసేందుకు తెలంగాణ పోలీసులు ఆయన ఇంటికి వెళ్లినట్లు తెలుస్తోంది.

Also Read: పింఛన్లపై ఏపీ ప్రభుత్వం క్లారిటీ .. సచివాలయాల్లో పంపిణీ..

నంద్యాల లోక్ సభ నియోజకవర్గ ఇన్ చార్జ్ గా ఉన్నారు మాండ్ర శివానంద రెడ్డి. ఎన్నికల ప్రచారంలో  పాల్గొటున్నారు. శివానంద రెడ్డి పారిపోవడంతో ఆయన నివాసానికి భారీగా చేరుకున్నారు టీడీపీ కార్యకర్తలు.