నిజమాబాద్లో వేర్వేరు చోట్ల నగదు పట్టివేత

నిజమాబాద్లో వేర్వేరు చోట్ల నగదు పట్టివేత

కామారెడ్డి ​టౌన్, వెలుగు: కామారెడ్డి టౌన్​లో శుక్రవారం ఓ వ్యక్తి నుంచి రూ.16,81,400 నగదును పోలీసులు సీజ్​ చేశారు.  బైక్​పై వెళ్తుండగా ఓ వ్యక్తి వద్ద తనిఖీ చేయడంతో ఈ నగదు పట్టుబడినట్లు పోలీసులు తెలిపాయి. ఎన్నికల కోడ్​ నేపథ్యంలో రూ.50 వేలకు మించి తీసుకెళ్లేటప్పుడు సరైన ఆధారాలు చూపాల్సి ఉంటుందని డీఎస్పీ ప్రకాశ్​ తెలిపారు.

సాలూరా చెక్​పోస్ట్ ​వద్ద..

బోధన్: సాలూరా వద్ద ఏర్పాటు చేసిన అంతర్రాష్ట్ర చెక్​పోస్ట్​వద్ద పోలీసులు రూ.5.11 లక్షల నగదు పట్టుకున్నారు. మహారాష్ట్ర నుంచి తెలంగాణ వైపు వస్తున్న అంబులెన్స్​ను ఈ నగదు దొరికింది. మహారాష్ట్రకు చెందిన పవన్​కుమార్​సింగ్ ​ట్రీట్​మెంట్ ​కోసం డబ్బులు తీసుకెళ్తున్నట్లు చెప్పారు. కానీ అంబులెన్స్​లో పేషెంట్​ లేకపోవడం, డబ్బులకు సంబంధించి ఎలాంటి ఆధారాలు చూపకపోవడంతో బోధన్​రూరల్​ఎస్ఐ నాగ్​నాథ్​ డబ్బులను సీజ్​చేసి,  కేసు నమోదు చేశారు


బాన్సువాడ: ఎలాంటి ఆధారాలు లేకుండా బైక్​పై తరలిస్తున్న రూ.2లక్షల నగదు పట్టుకున్నట్లు బాన్సువాడ సీఐ మహేందర్​రెడ్డి తెలిపారు. తాడ్కోల్​ చౌరస్తా నుంచి కొయ్యగుట్ట వైపు వెళ్తున్న వాహనాలను తనిఖీ చేయగా, ఎండీ ఫయీమ్ అనే వ్యక్తి దగ్గర నగదు దొరికినట్లు చెప్పారు..