
హైదరాబాద్: ప్రముఖ యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్యకు పాల్పడిన కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. స్వేచ్ఛ ఆత్మహత్యకు పాల్పడిన కేసుతో పాటు పూర్ణచంద్ర నాయక్‌పై చిక్కడపల్లి పోలీసులు మరో కేసు నమోదు చేశారు. స్వేచ్ఛ కూతురు ఫిర్యాదు మేరకు పూర్ణ చందర్ నాయక్‌పై పోక్సో కేసు నమోదు చేశారు. స్వేచ్ఛ కూతురి నుంచి పోలీసులు స్టేట్మెంట్ రికార్డ్ చేశారు.
పూర్ణచంద్ర నాయక్ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని పోలీసులకు స్వేచ్ఛ కూతురు ఫిర్యాదు చేసింది. యాంకర్ స్వేచ్ఛ మృతి కేసులో పూర్ణ చందర్ నాయక్‌ను చిక్కడపల్లి పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. మరికొద్ది సేపట్లో విచారణ అనంతరం పూర్ణ చందర్ నాయక్‌ను పోలీసులు రిమాండ్‌కు తరలించనున్నారు.
గత కొన్నాళ్ల నుంచి స్వేచ్ఛతో పూర్ణ చందర్ సహజీవనం చేస్తున్నాడు. వివాహం చేసుకోకుండా స్వేచ్ఛను వేధింపులకు గురిచేశాడని పూర్ణ చందర్ పై స్వేచ్ఛ తల్లిదండ్రులు ఆరోపణలు చేశారు. పూర్ణ వేధింపులు భరించలేకనే స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకుందని ఆమె తల్లిదండ్రుల పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్వేచ్ఛ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పూర్ణ చందర్ నాయక్‌ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇదిలా ఉండగా.. వీ6తో స్వేచ్ఛ కుమార్తె, స్వేచ్ఛ తండ్రి శంకర్ ఎక్స్‌క్లూజివ్‌గా మాట్లాడారు. పూర్ణ చందర్ నాయక్‌పై స్వేచ్ఛ కూతురు సంచలన ఆరోపణలు చేసింది. పూర్ణచంద్ర నాయక్ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించేవాడని, తనను కొన్ని సందర్భాల్లో తాను చెప్పుకో రాని విధంగా బ్యాడ్ టచ్ చేశాడని ఆవేదన వ్యక్తం చేసింది. ఎప్పుడు తనను విసిగించేవాడని, మమ్మీతో తనను ఎప్పుడు కలవనిచ్చేవాడు కాదని ఆమె చెప్పింది.
తన తల్లితో ఎప్పుడూ పూర్ణ చందర్ నాయక్ గొడవ పడేవాడని, తన మమ్మీ చావుకు ప్రధాన కారణం పూర్ణ చందర్ అని స్వేచ్ఛ కూతురు ఆరోపించింది. తన మమ్మీ సూసైడ్ చేసుకుంది పూర్ణచందర్ వల్లేనని, పూర్ణచందర్ లేఖలో రాసినవన్నీ అబద్ధాలేనని తెలిపింది. మమ్మీని పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని, మూడు సంవత్సరాల నుంచి పూర్ణచంద్రనాయక్ మమ్మీ వెంట పడ్డాడని స్వేచ్ఛ కూతురు చెప్పడం గమనార్హం.
స్వేచ్ఛ తండ్రి శంకర్ ఏం చెప్పారంటే..
* పూర్ణచందర్ వేధింపుల వల్లనే నా కూతురు ఆత్మహత్య చేసుకుంది
* స్వేచ ఆత్మహత్యకు కారణం పూర్ణ చంద్రనాయక్
* నా కూతురిని పెళ్లి చేసుకుంటానని మూడు సంవత్సరాల నుంచి పూర్ణచందర్ వెంటపడి వేధించాడు
* నా కూతురు పెళ్లికి అంగీకరించిన తర్వాత ఇద్దరి మధ్య చాలా సార్లు గొడవలు జరిగాయి
* పూర్ణచంద్రనాయక్ ఇంట్లో రీసెంట్గా ఒక ఫంక్షన్ జరిగింది.. ఆ ఫంక్షన్‌కు స్వేచ్ఛను పిలువలేదు
* ఎందుకు తనను పిలవలేదని స్వేచ్ఛ పూర్ణచందర్ నాయక్‌ను నిలదీసింది
* గొడవలు తారాస్థాయికి చేరడంతో ఇటీవల నా కూతురు పూర్ణచందర్‌తో ఉండను అని తేల్చి చెప్పింది
* జూన్ 26 ఇద్దరికీ గొడవ జరిగితే నన్ను ఇంటికి రమ్మని పిలిచింది
* ఆరోజు నేను స్వేచ్ఛతో మాట్లాడాను.. పూర్ణ చందర్‌తో సంబంధం కొనసాగించలేను అని కరాకండిగా చెప్పింది
* పూర్ణచందర్ వేధింపుల వల్ల నా కూతురు తీవ్ర మానసిక వేదనకు గురైంది
* మానసిక వేదన వల్లే స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకుంది
* నా మనవరాల్ని వేధించాడు.. పూర్ణచంద్ర నాయక్ బ్యాడ్ టచ్ చేశాడు
* స్వేచ్ఛ, పూర్ణచంద్రనాయక్ మ్యారేజ్ చేసుకున్నారని మాకు కొన్ని ఆధారాలు లభించాయి
* గతంలో ఎంతోమంది అమ్మాయిలను వేధించాడు
* పూర్ణచందర్‌ను పోలీసులు కఠినంగా శిక్షించాలి.. మాకు న్యాయం చేయాలి
* పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలి
* పూర్ణ చందర్ నాయక్ భవిష్యత్తులో మరే అమ్మాయి జీవితం నాశనం చేయకుండా చర్యలు తీసుకోవాలి