జూబ్లీహిల్స్ పబ్ కేసు.. పోలీసుల అదుపులో సాదుద్దీన్

జూబ్లీహిల్స్ పబ్  కేసు.. పోలీసుల అదుపులో సాదుద్దీన్

జూబ్లీహిల్స్ బాలిక కేసులో చంచల్ గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న సాదుద్దీన్ మాలిక్ ను  పోలీసులు  గురువారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో  ఏ1 నిందితుడిగా ఉన్న అతడిని పోలీసులు విచారించనున్నారు.  విచారణ నిమిత్తం సాదుద్దీన్ ను జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్ కు తరలించారు. మూడు రోజుల పాటు అతడిని విచారించనున్నారు. ఈ కేసుకు సంబంధించి మరో ఐదుగురు మైనర్లు జువైనల్ హోంలో ఉన్నారు.  కాగా, హైదరాబాద్ నగరంలో సంచలనం రేపిన ఈ కేసులో మొత్తం ఆరుగురిని అరెస్టు చేశామని, వీరిలో ఒక్కరే మేజర్ అని సీపీ సీవీ ఆనంద్ ఇటీవల మీడియా సమావేశంలో వెల్లడించారు. కేసులో ఐదుగురు మైనర్లు ఉన్నారు కాబట్టి.. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పేర్లు వెల్లడించడం లేదన్నారు. వారందరిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశామన్నారు. అయితే ఆరో వ్యక్తి బాధితురాలిపై రేప్ చేయలేదన్నారు. రేప్ చేసిన వారికి 20 ఏళ్ల జైలు శిక్ష లేదంటే.. జీవిత ఖైదు విధించే అవకాశం ఉందన్నారు. కేసుకు సంబంధించి తమ వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయన్నారు.