డ్రగ్స్పై పోలీసుల స్పెషల్ ఫోకస్ 

డ్రగ్స్పై పోలీసుల స్పెషల్ ఫోకస్ 

డ్రగ్స్ వాడకం నిరోధంపై పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. డ్రంకెన్ డ్రైవ్ టెస్టుల్లాగే డ్రగ్స్ టెస్టులు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. లాలాజలంతో డ్రగ్ టెస్ట్ నిర్వహించనున్నారు. దీంతో 2 నిమిషాల్లోనే ఫలితం రానుంది. రిజల్ట్ పాజిటివ్గా వస్తే బ్లడ్, యూరిన్ శాంపిల్స్ సేకరించి నిర్థారించుకోనున్నారు. ఇప్పటికే కేరళ, గుజరాత్ రాష్ట్రాల్లో చేపట్టిన ఈ ప్రయోగం చేపట్టగా సక్సెస్ అయింది. దీంతో హైదరాబాద్ పోలీసులు కూడా డ్రగ్స్ టెస్టులు నిర్వహించేందుకు యాక్షన్ ప్లాన్ రెడీ చేశారు. 

ఈ టెస్టు నిర్వహించేందుకు డ్రగ్ అనలైజర్లు వాడనున్నారు. ఒకవేళ ఎవరైనా డ్రగ్స్ తీసుకుంటే అనలైజర్లోని రెడ్  లైట్ బ్లింక్ అవుతుంది. గంజాయి, హాష్ ఆయిల్, కొకైన్, హెరాయిన్లను ఈ డ్రగ్ అనలైజర్లు గుర్తిస్తాయి. లా అండ్ ఆర్డర్, టాస్క్ ఫోర్స్ పోలీసులు ఈ డ్రగ్ పరీక్షలు నిర్వహించనున్నారు. 

For more news..

ప్రయాణికులకు మరోసారి షాకిచ్చిన టీఎస్ఆర్టీసీ 

ఫ్రీ కరెంట్ హామీ ఏమైంది?