స్కూల్‌‌ స్టూడెంట్స్‌‌కు పోలీస్‌‌ ట్రైనింగ్‌‌

స్కూల్‌‌ స్టూడెంట్స్‌‌కు పోలీస్‌‌ ట్రైనింగ్‌‌

రాజస్థాన్‌‌ గవర్నమెంట్‌‌ నిర్ణయం

కోటా (రాజస్థాన్‌‌) : స్కూల్‌‌ స్టూడెంట్స్‌‌కు పోలీస్‌‌ ట్రైనింగ్‌‌ ఇవ్వాలని రాజస్థాన్‌‌ గవర్నమెంట్‌‌ నిర్ణయించింది. నేరాలను అరికట్టడం, చిన్నతనం నుంచే చట్టాలపై ప్రాథమికంగా అవగాహన కల్పించేందుకు ఈ ‘స్టూడెంట్స్‌‌ పోలీస్‌‌ క్యాడెట్‌‌’ ట్రైనింగ్‌‌ ఉపయోగపడనుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ ఏడాది ఎంపిక చేసిన 930 స్టేట్‌‌ స్కూల్స్‌‌, 70 కేంద్రియ విద్యాలయాల్లో ఈ ప్రోగ్రాంను అమలు చేస్తున్నారు.

పోలీస్‌‌శాఖతో కలిసి స్టేట్‌‌ ఎడ్యుకేషన్‌‌ డిపార్ట్‌‌మెంట్‌‌ దీన్ని నిర్వహిస్తోంది. మానసికంగా స్టూడెంట్స్‌‌ను ధృడంగా ఉంచడం, టీనేజ్‌‌లో నేరాలకు పాల్పడకుండా చేయడం, సామాజిక బాధ్యత నేర్పడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని అధికారులు చెబుతున్నారు. రెండేళ్ల ఈ ట్రైనింగ్‌‌ను తొలి విడతలో 8, 9 క్లాస్‌‌ స్టూడెంట్స్‌‌కు ఇస్తున్నారు. ట్రైనింగ్‌‌ తర్వాత వివిధ ఏరియాల్లో క్షేత్రస్థాయిలో పనిచేయాల్సి ఉంటుంది. ఇప్పటికే 39 స్కూల్స్‌‌లో  ఈ ప్రోగ్రాం సక్సెస్‌ కావడంతో  మరిన్ని స్కూళ్లలో దీన్ని ఇంప్లిమెంట్‌‌ చేయాలని రాజస్థాన్‌‌ గవర్నమెంట్‌‌ నిర్ణయించింది.