జగిత్యాల జిల్లాలో పోలీసులు వర్సెస్ గంగపుత్రులు

జగిత్యాల జిల్లాలో పోలీసులు వర్సెస్ గంగపుత్రులు

జగిత్యాల జిల్లాలో పోలీసులతో గంగపుత్రలు వాగ్వాదానికి దిగారు. ఎంపీపీ ఇంటి ముట్టడికి బయలుదేన గంగపుత్రులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో మెట్ పల్లి మండలం వెల్లుల్ల గ్రామంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. 


దశాబ్ది వేడుకలో భాగంగా ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన చెరువు పండుగ రోజున గుండ్ల(బెస్త) కులస్తులకు బదులు.. ముదిరాజ్ కులస్తుల చెరువులో వలలు వేశారు. దీనిపట్ల కుల సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే స్థానిక ఎంపీపీ సాయిరెడ్డి సహకారంతోనే ఇద్దంతా చేస్తున్నారని  బెస్త కులస్తులు ఆరోపించారు. సాంప్రదాయం ప్రకారం చెరువులపై బెస్త కులస్తులకే ఆ హక్కు ఉంటుందని పోలీసులతో వాదించారు. వెల్లుల్ల గ్రామంలోని ఎంపీపీ సాయిరెడ్డి ఇంటిని ముట్టడించడానికి పెద్ద ఎత్తున్న సిద్దమయ్యారు. జగిత్యాల జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున కుల సంఘాలు గుమిగూడాయి. వారిని అడ్డుకోవడంతో.. కుల సంఘాల నేతలకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది.

ఈ క్రమంలో ఎంపీపీ సాయి రెడ్డి వీడియో ద్వారా గంగపుత్రులకు క్షమాపణలు చెప్పారు. దీంతో వివాదం సద్దుమణిగింది.