కశ్మీర్లో టెర్రర్ అటాక్.. ఒక పోలీస్ మృతి

కశ్మీర్లో టెర్రర్ అటాక్.. ఒక పోలీస్ మృతి

జమ్ము కశ్మీర్ లో మరోసారి టెర్రరిస్టులు దాడికి తెగబడ్డారు. బీఎస్ఎఫ్ సైనికులు, పోలీసుల జాయింట్ టీమ్ పై గ్రెనేడ్ దాడి చేశారు. జమ్ము కశ్మీర్ లోని బందిపొరాలో ఉన్న నిషత్ పార్క్ ఏరియాలో చోటు చేసుకున్న ఈ ఘటనలో ఒక పోలీస్ అధికారి మరణించారు. మరో నలుగురు పోలీసలు తీవ్రంగా గాయపడ్డారు. 

శుక్రవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో బందిపొరాలో విధులు నిర్వహిస్తున్న బీఎస్ఎఫ్, కశ్మీర్ పోలీస్ టీమ్ పై గుర్తు తెలియని టెర్రరిస్టులు గ్రెనేడ్ దాడి చేసి పరారయ్యారు. దీంతో ఐదుగురు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించగా.. ఒక పోలీస్ మరణించినట్లు జమ్ము కశ్మీర్ పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు. మిగిలిన నలుగురు చికిత్స పొందుతున్నారని, వారి కండిషన్ స్టేబుల్ గా ఉందని చెప్పారు. మరణించిన పోలీస్ అధికారిని జుబైర్ అహ్మద్ అని గుర్తించామని తెలిపారు. టెర్రరిస్టుల అటాక్ జరిగిన వెంటనే ఆ ప్రాంతాన్ని పూర్తిగా తమ కంట్రోల్ లోకి తీసుకున్నామని, దాడికి పాల్పడిన వాళ్ల కోసం సెర్చ్ ఆపరేషన్ సాగుతోందని అన్నారు.

మరిన్ని వార్తల కోసం..

మోడీని దేశం నుంచి తరిమేస్తాం

అధికారంలోకి వచ్చాక 2 కోట్ల మంది యువతకు స్మార్ట్ ఫోన్లు

గల్ఫ్ జైళ్లలో ఉన్న భారతీయుల వివరాలు వెల్లడించిన కేంద్రం