తిరుపతి: పోలీసింగ్ విజిబుల్ ప్రోగ్రాం.. పలు సర్కిళ్లలో ఎస్పీ ఆధ్వర్యంలో తనిఖీలు

తిరుపతి: పోలీసింగ్ విజిబుల్ ప్రోగ్రాం.. పలు సర్కిళ్లలో ఎస్పీ ఆధ్వర్యంలో తనిఖీలు

తిరుపతిలో  విజిబుల్​ పోలీసింగ్​ కార్యక్రమాన్ని ప్రారంభించారు.  తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్దన్​ రాజు తన సిబ్బందితో పలు సెంటర్లలో విస్తృతంగా తనిఖీలు చేశారు.  బస్టాండ్​ సమీపంలోని పూర్ణకుంభం సర్కిల్​.. ఇందిరా ప్రియదర్శిని వెజిటబుల్​ మార్కెట్​..రైల్వేస్టేషన్​ తదితర ప్రాంతాల్లో పర్యటించారు. 

బస్టాండ్​ సమీపంలోని  పూర్ణకుంభం సర్కిల్​ లో   ఆటో స్టాండ్ ను పరిశీలించిన ఎస్పీ ... అక్కడ ఆటో డ్రైవర్ లతో  మాట్లాడుతూ ..దూర  ప్రాంతాల నుంచి  శ్రీవారి దర్శనం కోసం  వస్తున్న భక్తుల పట్ల  డ్రైవర్లు మర్యాదగా వ్యవహరించాలని  సూచించారు. ఎక్కడపడితే అక్కడ.. రోడ్లపై ఆటోలు పార్క్​ చేసి ప్రయాణికులను ఎక్కించుకోవద్దని.. ఆటోల వల్ల ట్రాఫిక్​ అంతరాయం లేకుండా చూడాలన్నారు.  ప్రతి ఆటో డ్రైవర్​ లైసెన్స్​.. ఇతర దస్త్రాలు ఉండి .. కచ్చితంగా యూనిఫాం ధరించాలన్నారు.  దీనివలన ఆటో డ్రైవర్లకు గౌరవం పెరుగుతుందన్నారు. 

ఇందిరా ప్రియదర్శిని వెజిటెబుల్ మార్కెట్ ను పరిశీలించిన ఎస్పీ.. వ్యాపారస్తుల సాదక బాధకాలను అడిగి తెలుసుకున్నారు.  సోలార్​ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన తరువాత  దొంగతనాలు.. మద్యం సేవించి ఆగడాలకు పాల్పడటం లాంటి చట్ట వ్యతిరేక ఘటనలు జరగడం లేదని పోలీసులకు వ్యాపారస్తులు తెలిపారు.  మార్కెట్​ లో ఎవరైనా అనుమానాస్పదంగా తిరుగుతుంటే ఎస్పీ గారి దృష్టికి తీసుకురావాలని కోరారు. మీకు ఏదైన సమస్య వస్తే...  పోలీసులకు సమాచారం ఇస్తే...  తమ సిబ్బంది వచ్చి సమస్యను  పరిష్కారిస్తారని తెలిపారు.

తిరుపతి రైల్వేస్టేషన్ లోని  ఆటో స్టాండ్ ను పరిశీలించిన ఎస్పీ ఆటోలకు ఉండే . డిజిటల్ క్యూఆర్ కోడ్ స్టిక్కర్లను పరిశీలించారు. ఆటో లోపల తనిఖీ చేస్తే ఎక్కువ స్టిక్కర్లు వేసిన విషయాన్ని గమనించారు. ప్రయాణికులకు ఈ స్టిక్కర్లు విజిబుల్​ గా ఉండేందుకు ఆటో వాలాలు తీసుకున్న చర్యలపై ఎస్పీ సంతోషం వ్యక్తంచేశారు. తిరుపతికి వచ్చే ప్రయాణికుల పట్ల గౌరవంగా వ్యవహరించాలని.. ఎవరైనా అమర్యాదగా ప్రవర్తిస్తే కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.