త్వరలో పొలిమేర 3

త్వరలో పొలిమేర 3

హారర్ జానర్‌‌‌‌లో వచ్చిన పొలిమేర, పొలిమేర 2 సినిమాలు సక్సెస్‌‌ సాధించడంతో ఈ ప్రాంచైజీలో మూడో సినిమాకు ప్లాన్ చేశారు మేకర్స్.  బుధవారం ‘పొలిమేర 3’ చిత్రాన్ని ప్రకటించారు. అనిల్ విశ్వనాథ్ దీనికి దర్శకత్వం వహించనుండగా... భోగేంద్ర గుప్తాతో కలిసి వంశీ నందిపాటి నిర్మిస్తున్నారు.

ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని, త్వరలో ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభించనున్నట్టు  చెప్పారు.  ఈ సందర్భంగా విడుదల చేసిన వీడియో ఆసక్తి రేపుతోంది.  సత్యం రాజేష్, బాలాదిత్య, కామాక్షి భాస్కర్ల, గెటప్ శ్రీను, రవి వర్మ, రాకేందు మౌళి, చిత్రం శ్రీను, సాహిత్య దాసరి ప్రధాన పాత్రల్లో నటించనున్నారు.