హైదరాబాద్, వెలుగు: లోక్ సభ ఎన్నికల ఎఫెక్ట్ పాలిసెట్-2024 ఎగ్జామ్ పై పడింది. మే17న నిర్వహించాల్సిన పాలిసెట్ పరీక్షలను.. మే24న పెడ్తామని టెక్నికల్ ఎడ్యుకేషన్ బోర్డు సెక్రటరీ పుల్లయ్య ప్రకటించారు. కాగా, ఫిబ్రవరి 15 నుంచి అప్లికేషన్ల ప్రక్రియ ప్రారంభం కాగా, బుధవారం సాయంత్రం వరకూ 20వేల వరకూ దరఖాస్తులు అందాయి.
ఏప్రిల్ 22 వరకూ అప్లై చేసుకునేందుకు అవకాశం ఉంది. టెన్త్ పరీక్షలు పూర్తయితే, దరఖాస్తులు పెరుగుతాయని అధికారులు చెప్తున్నారు. గతేడాది పాలిసెట్ కు లక్షన్నర దరఖాస్తులు వచ్చాయి.
