
హుజురాబాద్ బైపోల్ కోసమే కేసీఆర్ ఆరాటమన్నారు ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్. ఒక్క ఉపఎన్నిక కోసం ఇన్ని అబద్దాలాడటం సిగ్గుచేటన్నారు. హుజురాబాద్ లో సొంతపార్టీ నేతల కొనేందుకు టీఆర్ఎస్ 3వందల కోట్లు ఖర్చు చేస్తుందని ఆరోపించారు. తెలంగాణలో రాజకీయ వ్యాపారం నడుస్తుందన్నారు. ప్రశ్నించే గొంతులను అరెస్ట్ చేస్తున్నారని మండిపడ్డారు దాసోజు శ్రవణ్.
మల్లారెడ్డివి చదువులు అమ్ముకునే కాలేజీలు
దళితులను,గిరిజనులు కేసీఆర్ మోసం చేశారన్నారు పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి. సీఎం దత్తత తీసుకున్న గ్రామాల్లోనూ అభివృద్ధి జరగలేదన్నారు. మల్లారెడ్డి చదువులు అమ్ముకునే కాలేజీలు నడుపుతున్నారని మండిపడ్డారు.తనపై ఆరోపణలకు మల్లారెడ్డి సమాధానం చెప్పకుండా.. రౌడీ భాష వాడుతున్నారన్నారు. రాష్ట్రంలో 16 లక్షల కుటుంబాలకు దళిత బంధు అమలు చేయాలని డిమాండ్ చేశారు.