మార్టిన్ లూథర్ కింగ్ మూవీలో సంపూర్ణేష్ బాబు ఓటే కీలకం

మార్టిన్ లూథర్ కింగ్ మూవీలో సంపూర్ణేష్ బాబు ఓటే కీలకం

సంపూర్ణేష్ బాబు లీడ్ రోల్‌‌‌‌లో నటిస్తున్న పొలిటికల్ సెటైర్ మూవీ ‘మార్టిన్ లూథర్ కింగ్’. పూజ కొల్లూరు దర్శకత్వం వహించారు. దర్శకుడు వెంకటేష్ మహా స్క్రీన్‌‌‌‌ప్లే, డైలాగ్స్ అందించడంతో పాటు ఓ క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌లో నటించాడు.  నరేష్, శరణ్య ప్రదీప్ కీలకపాత్రల్లో నటించారు. వైనాట్ స్టూడియోస్, రిలయన్స్ ఎంటర్‌‌‌‌టైన్‌‌‌‌మెంట్, మహాయాన మోషన్ పిక్చర్స్ సంస్థలు నిర్మించాయి.

రెండు వర్గాలుగా విడిపోయిన ఓ గ్రామంలో ఎన్నికలు రావడంతో.. చెప్పులు కుట్టుకునే మార్టిన్ లూథర్ కింగ్ అనే వ్యక్తి ఓటు కీలకంగా మారుతుంది. గెలుపుని నిర్ణయించే ఓటు తనదే  కావడంతో ఒక్క రాత్రిలో అతని జీవితం ఎలాంటి మలుపు తిరిగింది అనేది మిగతా కాన్సెప్ట్.

ఇప్పటికే ట్రైలర్‌‌‌‌‌‌‌‌ను విడుదల చేసిన టీమ్, గత కొద్దిరోజులుగా ఏపీ, తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో ప్రీమియర్ షోస్‌‌‌‌ వేశారు. ఈనెల 27న సినిమా విడుదల కాబోతోంది. దిల్‌‌‌‌రాజుకు చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ విడుదల చేస్తోంది.