బతుకమ్మ పండుగలో పాలిటిక్స్​

V6 Velugu Posted on Oct 14, 2021

  • సిలిండర్​బొమ్మల ఏర్పాటుపై మహిళల ఆగ్రహం


హుజూరాబాద్,​ వెలుగు:   బతుకమ్మ ఆడే ప్రదేశాన్ని సైతం రాజకీయ ప్రచారానికి వేదికగా మార్చడంపై మహిళలు మండిపడ్డారు. హుజూరాబాద్​లో బతుకమ్మ వేడుకలు జరుపుకొనే చోట, చావడికి చేరుకునే దారిలో గ్యాస్​ సిలిండర్ల రూపంలో బొమ్మలను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఉంచారు. గ్యాస్​రేట్లు పెంచారంటూ దానిపై రాశారు. బతుకమ్మలను తీసుకొని వస్తున్న పలువురు మహిళలు వాటిని చూసి ఇక్కడ సైతం రాజకీయాలేంటని విసుక్కున్నారు. విషయాన్ని పలువురు ఫిర్యాదు చేయడంతో పట్ణణ సీఐ శ్రీనివాస్​ అక్కడికి చేరుకొని మున్సిపల్​ సిబ్బంది సహకారంతో తీసివేశారు. కాగా బతుకమ్మ వేడుకలకు వెళ్లే దారిలో పోలీసులు కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేశారు. వెహికల్స్​ను లోపలికి అనుమతించలేదు. అయితే వీటిని ఎవరు తీసుకువచ్చారో గుర్తించి పండుగను రాజకీయాలకు వాడుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని బీజేపీ లీడర్లు డిమాండ్​చేశారు.  
 

Tagged POLITICS, Huzurabad, Batukamma Festival,

Latest Videos

Subscribe Now

More News