తెలంగాణ అసెంబ్లీ : ఎలా ఉన్నారు కేసీఆర్ గారు.. సభలో సీటు దగ్గరకు వచ్చి కేసీఆర్ కు సీఎం రేవంత్ షేక్ హ్యాండ్

తెలంగాణ అసెంబ్లీ : ఎలా ఉన్నారు కేసీఆర్ గారు.. సభలో సీటు దగ్గరకు వచ్చి కేసీఆర్ కు సీఎం రేవంత్ షేక్ హ్యాండ్

తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం అయిన తొలి రోజునే.. సభలో ఆసక్తికర దృశ్యం. అందరి కంటే ముందే సభలోకి వచ్చిన కేసీఆర్.. తన సీట్లో కూర్చుకున్నారు. ఆ తర్వాత సభలోకి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి.. మాజీ సీఎం కేసీఆర్ ను చూశారు. వెంటనే కేసీఆర్ దగ్గరకు వెళ్లి.. ఎలా ఉన్నారు కేసీఆర్ గారూ అంటూ పలకరిస్తూ.. షేక్ హ్యాండ్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్ సీటు దగ్గరకు స్వయంగా వచ్చి మరీ సీఎం రేవంత్ రెడ్డి పలకరించటం.. షేక్ హ్యాండ్ ఇవ్వటం విశేషం. కేసీఆర్ కు షేక్ హ్యాండ్ ఇచ్చిన తర్వాతనే.. మిగతా మంత్రులను పలకరిస్తూ.. తన సీట్లో కూర్చున్నారు సీఎం రేవంత్ రెడ్డి

అసెంబ్లీ సభలోకి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి.. తన సీటు దగ్గర ఉండి మాజీ సీఎం కేసీఆర్ కు నమస్కారం చేశారు. అయితే కేసీఆర్ నుంచి ఎలాంటి స్పందన లేదు. దీంతో స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి.. కేసీఆర్ సీటు దగ్గరకు వెళ్లి మరీ షేక్ హ్యాండ్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. 

సభ ప్రారంభం అయిన 3 నిమిషాలు మాత్రమే ఉన్న కేసీఆర్.. ఆ తర్వాత సభ నుంచి వెళ్లిపోయారు.