ముగిసిన రాజ్యసభ ఎన్నికల పోలింగ్

ముగిసిన రాజ్యసభ ఎన్నికల పోలింగ్

న్యూఢిల్లీ: రాజ్యసభ ఎన్నికల  పోలింగ్ ముగిసింది. నాలుగు రాష్ట్రాల్లోని 16 స్థానాలకు పోలింగ్ జరిగింది. ఉదయం ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటలతో ముగిసింది. గంట తర్వాత ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. 15 రాష్ట్రాల పరిధిలోని 57 స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు షెడ్యూల్  వెలువడగా.. 41 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో మహారాష్ట్ర, కర్ణాటక, హర్యానా, రాజస్థాన్  రాష్ట్రాల పరిధిలో 16 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మహారాష్ట్రలో ఆరు స్థానాలకు, కర్ణాటకలో నాలుగు, రాజస్థాన్ లో నాలుగు, హర్యానాలో రెండు స్థానాలకు పోలింగ్ ముగిసింది. మొత్తం 16 స్థానాలకు మరో గంటలో లెక్కింపు పక్రియ ప్రారంభంకానుంది.