వేములవాడ, వెలుగు: రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా వెబ్ కాస్టింగ్ ద్వారా సమస్యాత్మక కేంద్రాలను పర్యవేక్షించినట్లు ఇన్‌చార్జి కలెక్టర్ గరిమా అగ్రవాల్ తెలిపారు. ఆదివారం రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా బోయినిపల్లి, ఇల్లంతకుంట, తంగళ్లపల్లి మండలాల్లోని పలు గ్రామాల్లో పరిశీలించారు. బోయినిపల్లి, నీలోజిపల్లి గ్రామాలతో పాటు తంగళపల్లిలోని పోలింగ్ కేంద్రాలను అడిషనల్ కలెక్టర్ గడ్డం నగేశ్‌తో కలిసి కలెక్టర్ సందర్శించారు.
ఈ సందర్భంగా ఓటింగ్ సరళిని పరిశీలించి, అధికారులతో మాట్లాడారు. అంతకుముందు కలెక్టరేట్‌లో ఏర్పాటు వెబ్ క్యాస్టింగ్ సెంటర్‌ను పరిశీలించారు. 195 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షించినట్లు తెలిపారు. కలెక్టర్ వెంట ఆర్డీవో రాధాభాయ్, సీపీఓ శ్రీనివాసాచారి తదితరులు ఉన్నారు.
ఓట్ల లెక్కింపు పరిశీలన
రెండో ఫేజ్ ఎన్నికల్లో భాగంగా పలు ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో ఇన్‌చార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమా అగ్రవాల్ ఆదివారం పరిశీలించారు. ఇల్లంతకుంట మండల కేంద్రం, వల్లంపట్ల, తంగళపల్లి మండలంలోని సారంపల్లి గ్రామాల్లోని స్కూళ్లలో ఓట్ల లెక్కింపును కలెక్టర్ పరిశీలించారు.
అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆమె వెంట ఏఎస్పీ చంద్రయ్య, సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లు, జడ్పీ డిప్యూటీ సీఈవో గీత, తహసీల్దార్ జయంత్, ఎంపీడీఓలు శశికళ, లక్ష్మీనారాయణ అధికారులు, సిబ్బంది తదితరులు ఉన్నారు.
