ఢిల్లీలో మళ్లీ ముంచుకొస్తున్న కాలుష్యం

ఢిల్లీలో మళ్లీ ముంచుకొస్తున్న కాలుష్యం

దేశ రాజధాని ఢిల్లీకి మళ్లీ కాలుష్యం ముప్పు ముంచుకొస్తొంది. అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నా.. శివారు ప్రాంతంలోని రైతుల తీరు మారడం లేదు. హర్యానా, పంజాబ్ రైతులు మళ్లీ ఎండు గడ్డిని తగలబెడుతున్నారు. కర్నాల్ జిల్లాలోని దాదాపు 30 గ్రామాల రైతులు.. తమ పంట పూర్తవడంతో ఎండుగడ్డిని పేర్చి తగలబెట్టారు.

రైతుల చర్యలతో రెండేళ్లుగా ఈ సీజన్ లో ఢిల్లీలో కాలుష్య తీవ్రత పెరిగిపోతోంది.  హర్యానా, పంజాబ్ ప్రభుత్వాలపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్. రైతులను చైతన్యం చేయడంలో రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆరోపించారు. అయితే గడ్డిని తలగబెట్టకుండా రైతులకు అవగాహన కల్పిస్తున్నామని కర్నాల్ జిల్లా వ్యవసాయ శాఖ అధికారి చెప్పారు. ప్రస్తుతం మంటలు వస్తున్న 30 గ్రామాలకు అదనపు సిబ్బందిని పంపించామని తెలిపారు.