తెలంగాణలో వాయు కాలుష్యం తగ్గింది : పొల్యూషన్ కంట్రోల్ బోర్డు

తెలంగాణలో వాయు కాలుష్యం తగ్గింది : పొల్యూషన్ కంట్రోల్ బోర్డు

 జీడిమెట్ల, వెలుగు :  తెలంగాణ రాష్ట్రంలో నేషనల్​ క్లీన్​ఎయిర్​ ప్రోగ్రాం (ఎన్​సీఏపీ)ద్వారా చేపట్టిన పలు కార్యక్రమాలతో వాయుకాలుష్యం తగ్గిందని పొల్యూషన్​ కంట్రోల్​ బోర్డు మెంబర్​ సెక్రటరీ ఎస్. కృష్ణ ఆదిత్య అన్నారు. సనత్‌నగర్‌‌లోని రాష్ట్ర పీసీబీ కార్యాలయంలో  ప్రభుత్వ స్పెషల్ చీఫ్‌ సెక్రటరీ డాక్టర్. రజత్‌ కుమార్‌‌ పీసీబీపై గురువారం రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేషనల్​ క్లీన్​ ఏయిర్​ ప్రోగ్రాం కింద 2019 నుంచి వివిధ కార్యక్రమాలు చేపట్టామన్నారు.  

గ్రీన్​బెల్టులను అభివృద్ధి చేయడం, స్మార్ట్​ లైట్స్​ప్రవేశపెట్టడం, బ్లాక్​టాప్​రోడ్డు, మెకనైజ్డ్ స్వీపింగ్​ చేయడం వల్ల తెలంగాణలో గాలి నాణ్యత మెరుగుపడిందన్నారు.  ఢిల్లీ, ముంబయి, బెంగళూరులతో పోలిస్తే హైదరాబాద్​నగరంలో గాలిలో దూళి సాంద్రత 11శాతం తగ్గిందన్నారు.  మురుగునీటి శుద్ధి 2023 నాటికి 1259 ఎం.ఎల్.డీలు పెంచుతామన్నారు.  తద్వారా చెరువుల్లో నీటి నాణ్యత పెరుగుతుందన్నారు.  రాష్ట్రంలో ఎన్విరాన్​మెంటల్​ మేనేజ్​మెంట్​ బెస్ట్​ ప్రాక్టీసెస్​ కోసం ఈ నెల 16, 17 తేదీల్లో ఢిల్లీలో పలు రంగాల్లోని నిపుణులతో సంప్రదింపులు చేస్తామని చెప్పారు.