సమాచారమిస్తే రూ. 10 వేలు

సమాచారమిస్తే రూ. 10 వేలు

హైదరాబాద్‌, వెలుగు: ప్రమాదకరమైన వ్యర్థ పదార్థాలను బహిరంగ ప్రదేశాలు, నాలాల్లో వేస్తున్నా.. లేదా కాలుష్య నియంత్రణ చట్టాల వ్యతిరేక కార్యకలాపాలను సాగిస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కాలుష్య నియంత్రణ మండలి ప్రకటించింది. దీనిపై విశ్వసనీయమైన సమాచారం ఇచ్చిన వారికి పారితోషికం గరిష్ఠంగా రూ.10 వేలకు పెంచినట్లు కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

కాలుష్య నియంత్రణ చట్టాలను ఉల్లంఘిస్తూ రహస్యంగా ప్రమాదకరమైన విష వాయువులు విడుదల చేసినా… రసాయన వ్యర్థ జలాలు లేదా వ్యర్థాలను పడవేసినా లేదా కాల్చిన వ్యక్తులపై, పరిశ్రమలపై తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి చట్టపరమైన చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు. కాలుష్య కారక పరిశ్రమలు లేదా వ్యక్తులపై విశ్వసనీయమైన సమాచారాన్ని అధికారులకు మొబైల్‌ నెంబర్లు 90005 51355, 99490 78336, 91773 03206 ద్వారా లేదా ms-tspcb@telangana.gov.in కి మెయిల్‌ చేయాలన్నారు