ఆరోగ్యానికి, అందానికి 'దానిమ్మ' ఒక సంజీవని.. ఎందుకు తినాలో తెలుసా ?

  ఆరోగ్యానికి, అందానికి 'దానిమ్మ' ఒక సంజీవని.. ఎందుకు తినాలో తెలుసా ?

ప్రకృతి మనకిచ్చిన అద్భుతమైన పండ్లలో దానిమ్మ ఒకటి. ఎర్రగా మెరిసిపోయే దానిమ్మ పండును చూడగానే ఎవరికైనా తినాలనిపిస్తుంది. అయితే, దానిమ్మ కేవలం రుచికి మాత్రమే కాదు.. ఆరోగ్యానికి కూడా ఒక సంజీవని లాంటిది. ఈ పండు నిండా గింజలే కాదు, గింజ గింజలోనూ మన శరీరానికి అవసరమైన పోషకాలు ఫుల్లుగా ఉంటాయి. రోజూ ఒక దానిమ్మ పండు తిన్నా లేదా ఒక గ్లాసు రసం తాగినా చర్మ సౌందర్యం పెరగడమే కాకుండా, ఎన్నో రకాల వ్యాధులతో పోరాడే రోగనిరోధక శక్తి శరీరానికి లభిస్తుంది. అసలు దానిమ్మను మన డైట్‌లో భాగం చేసుకోవడం వల్ల ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయో ఇప్పుడు చూద్దాం...

*దానిమ్మ పండు నిండా గింజలేకాదు.. గింజ గింజలో పోషకాలు ఫుల్లుగా ఉంటాయి. అవి వ్యాధులతో పోరాడే శక్తిని శరీరానికి ఇస్తాయి.

*అంటువ్యాధులు, అలర్జీల వల్ల చర్మం దెబ్బతినకుండా ఉండాలంటే దానిమ్మను డైట్ లో భాగం చేసుకోవాలి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ ఫ్లమేటరీ లక్షణాలు చర్మంపై ఓ పొరను ఏర్పరుస్తాయి. ఈ పొర కంటికి కనిపించదు. పొడి చర్మం, వయసు మీద పడటం వల్ల వచ్చే మచ్చలు, హైపర్ పిగ్మెంటేషన్ వంటి సమస్యలను చాలా త్వరగా పరిష్కరిస్తుంది.

*దానిమ్మపండులో శరీరానికి సరిపడా విటమిన్ -ఇ ఉంటుంది. ఒక కప్పు దానిమ్మ రసంలో 1.8 మిల్లీగ్రాములు విటమిన్-ఇ ఉంటుంది.

*దానిమ్మను జింక్ లోడెడ్ అని కూడా చెబుతారు. స్కిన్సెల్స్ డెవలప్మెంట్ లో జింక్ 'కీ' రోల్ పోషిస్తుంది. ఒక దానిమ్మ పండులో 1.1 మిల్లీగ్రాముల జింక్ ఉంటుంది. ఇది ఒక వ్యక్తికి అవసరమైన జింక్ లో 15శాతాన్ని భర్తీ చేస్తుంది. 

*ఇందులో కాపర్ కూడా ఎక్కువే. శరీరంలో మెలనిన్ ఉత్పత్తికి సాయపడుతుంది. కళ్లు, స్కిన్, హెయిర్ ఇలా అన్నింటినీ ఆరోగ్యంగా ఉంచుతుంది. ఒక కప్పు దానిమ్మ రసం తీసుకోవడం అంటే 500 మైక్రోగ్రాముల కాపర్ తో సమానం.

►ALSO READ | మీకు తెలుసా : తుమ్మును బలవంతంగా ఆపేస్తే చెవుడు వచ్చే ప్రమాదం, కంట్లో రక్తనాళాలు దెబ్బతింటాయి..!

 *గాయాలను మాన్పడంలో దానిమ్మకు మించింది లేదు. కణాలు రీజనరేట్ కావాలంటే అవసరమైన అన్ని ఎలిమెంట్స్ దానిమ్మలో పుష్కలంగా ఉంటాయి.

 *శరీరంలో హార్మోన్ల సరైనపాళ్లలో లేకపోవడం కారణంగా మొటిమలు ఏర్పడతాయి. దానిమ్మ తినటం వల్ల మొటిమలు తగ్గిపోతాయి. అందుకు కారణం దానిమ్మలో ఉండే విటమిన్-సి. ఇది నూనె గ్రంధుల్లో జిడ్డు పేరుకుపోకుండా చేస్తుంది.

*దానిమ్మ పండులో ఉండే ఐరన్ నిల్వలు కూడా శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా ఆక్సిజన్ రవాణాలో ఉపయోగపడే హిమోగ్లోబిన్ శాతం పెరగడానికి దానిమ్మలోని ఐరన్ ఎంతగానో ఉపయోగపడుతుంది.

*ఇవేకాకుండా క్యాన్సర్ నిరోధించడంలో, జీర్ణ సమస్యలను పరిష్కరించడంలో, ఎముకలను బలంగా మార్చడంలో దానిమ్మలోని ఔషధ గుణాలు ఎంతగానో సాయపడతాయి.