పొంగులేటిదే పాలేరు... కాంగ్రెస్ దే  తెలంగాణ: పొంగులేటి ప్రసాద్ రెడ్డి 

పొంగులేటిదే పాలేరు... కాంగ్రెస్ దే  తెలంగాణ: పొంగులేటి ప్రసాద్ రెడ్డి 

ఖమ్మం రూరల్​/ కూసుమంచి, వెలుగు : పాలేరు నియోజకవర్గంలో గెలుపు పొంగులేటి శ్రీనివాస రెడ్డిదేనని, రాష్ట్రంలో అధికారం కాంగ్రెస్ దేనని ఆ పార్టీ జిల్లా నాయకులు పొంగులేటి ప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. గడప గడపకు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని కూసుమంచి మండలం నాయకన్ గూడెం, జుజ్జల్​రావుపేట గ్రామాల్లో   శనివారం నిర్వహించారు. ఇంటింటికీ తిరిగి కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను వివరించారు. ఈ సందర్భంగా ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి ఓడిపోవడం ఖాయమన్నారు.

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్​ ప్రభుత్వమే వస్తుందన్నారు. ప్రజల చూపంతా కాంగ్రెస్ వైపే ఉందన్నారు. అనంతరం ప్రవళిక మృతిని నిరసిస్తూ  నిర్వహించిన కొవ్వొత్తుల ప్రదర్శనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన  బతుకమ్మ దగ్గర నృత్యాలు చేశారు.  అలాగే ఖమ్మం రూరల్ మండలంలో పర్యటించారు. ఆరెకోడు గ్రామానికి చెందిన గునిగంటి లింగమ్మ మృతి చెందగా ఆమె మృతదేహాన్ని సందర్శించి నివాళి అర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

నాయుడుపేట గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న పలువురిని పరామర్శించారు. ఆయా కార్యక్రయాల్లో  పార్టీ మండల అధ్యక్షుడు కల్లెం వెంకటరెడ్డి, బజ్జూరి వెంకటరెడ్డి, భీష్మా చారి, సుధీర్ రెడ్డి, ముదిరెడ్డి శ్రీనివాస రెడ్డి, దామోదర్, దేశబోయిన నాగేశ్వరరావు, గడ్డం గంగయ్య, గొల్లపూడి వీరన్న, లింగారెడ్డి, కందుల రాజా , భైరు హరినాథ్​ బాబు, సూదగాని ఉపేందర్, ఉప్పగండ్ల ప్రసాద్, ఏనుగు వెంకటరెడ్డి, అజ్మీరా అశోక్, గునిగంటి రమేశ్, కుసుమ రాజా, గునిగంటి గాంధీ తదితరులున్నారు.