జర్నలిస్టుల సంక్షేమంపై ఈ నెల 15 తర్వాత ఉన్నతస్థాయి మీటింగ్ : పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

జర్నలిస్టుల సంక్షేమంపై ఈ నెల 15 తర్వాత  ఉన్నతస్థాయి మీటింగ్ : పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు : జర్నలిస్టుల ఇంటి స్థలాలు, సంక్షేమ చర్యలకు సంబంధించి ఈనెల 15 తరువాత ఒకరోజు అధికారుల తో ఉన్నతస్థాయి సమావేవం ఏర్పాటు చేస్తామని రెవెన్యూ, ఐ అండ్ పీఆర్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. గురు వారం సెక్రటేరియెట్​లోని మంత్రి చాంబర్ లో ఐజేయూ, టీయూడబ్ల్యూజే ప్రతినిధి బృందం మంత్రిని కలిసింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, జర్నలిస్టుల ఇంటి స్థలాలకు సంబంధించి గత ప్రభుత్వాలు ఇప్పటివరకు జారీ చేసిన జీవోలు, మెమోలు  సేకరించాలని ఆదేశించినట్లు చెప్పారు. 

ఇప్పటికే ఇచ్చిన స్థలాలు, స్వాధీనం చేయ కుండా ఉన్న స్థలాలు, ఇకముందు ఇవ్వడాని కి అనువైన స్థలాలను నిర్ధిష్టంగా పేర్కొంటూ రిపోర్టులు ఇవ్వాలని 33 జిల్లాల కలెక్టర్లను ఆదేశించినట్టు పేర్కొన్నారు. సమస్యను సీఎంతో చర్చించి తప్పని సరిగా పరిష్కారం చూపుతామని మంత్రి హామీ ఇచ్చారు.