మున్సిపల్ ఎన్నికల్లో ప్రజా ప్రభుత్వాన్ని గెలిపించండి : మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి

మున్సిపల్ ఎన్నికల్లో ప్రజా ప్రభుత్వాన్ని గెలిపించండి : మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి

తొర్రూరు, వెలుగు : మున్సిపల్​ఎన్నికల్లో ప్రజా ప్రభుత్వాన్ని ఆశీర్వదించి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని రాష్ట్ర  గృహ, రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి అభ్యర్థించారు. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి, టీ పీసీసీ వైస్​ప్రెసిడెంట్​ఝాన్సీరెడ్డి ఆధ్వర్యంలో  శనివారం మహబూబాబాద్​జిల్లా తొర్రూరు ఒకటి, రెండో వార్డులో పార్టీ  అభ్యర్థులు తాళ్లపల్లి శ్రీలత, తూనం శ్రావణ్ ను గెలిపించాలని కోరుతూ ఇంటింటా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల సంక్షేమమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పని చేస్తుందన్నారు.

రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు గ్రామస్థాయి వరకు చేరేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. మున్సిపాలిటీల అభివృద్ధికి నిధుల కొరత లేకుండా చూస్తామన్నారు.  తొర్రూరును దత్తత తీసుకొని మోడల్​గా తీర్చిదిద్దుతానన్నారు. ప్రతిపక్షాల తప్పుడు ఆరోపణలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.  నియోజకవర్గ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.