ఏపీ సీఎం జగన్తో పొంగులేటీ శ్రీనివాస్ రెడ్డి భేటీ

ఏపీ సీఎం జగన్తో పొంగులేటీ శ్రీనివాస్ రెడ్డి భేటీ

ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏపీ సీఎం వైఎస్ జగన్ను కలిశారు. తాడేపల్లిగూడెం వెళ్లిన పొంగులేటి.. సీఎం క్యాంపు కార్యాలయంలో జగన్‌తో సమావేశమై భవిష్యత్ రాజకీయ కార్యాచరణపై చర్చించినట్లు తెలుస్తోంది. పొంగులేటి గత కొంత కాలం నుంచి బీఆర్ఎస్ కు దూరంగా ఉంటున్నారు. తొలుత ఆయన కాంగ్రెస్, బీజేపీలో చేరుతారనే ప్రచారం జరిగినా.. ప్రస్తుతం వైఎస్సార్టీపీలో చేరుతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఆయన వైఎస్ షర్మిలతో మంతనాలు కూడా సాగించినట్లు సమాచారం. అందులో భాగంగానే ఆయన జగన్ను కలిశారనే ప్రచారం జరుగుతుంది. 2014లో ఆయన ఖమ్మం నుంచి వైసీపీ తరుపున పోటీ చేసి ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత బీఆర్ఎస్ లో చేరారు. అయినప్పటికీ జగన్ తో పొంగులేటి దగ్గర సంబంధాలు కొనసాగించారు.