అమిత్ షా సభకు కేసీఆర్ 1000 బస్సులు పంపించిన్రు: పొంగులేటి

అమిత్ షా సభకు కేసీఆర్ 1000 బస్సులు పంపించిన్రు: పొంగులేటి

ఖమ్మం వేదికగా బీఆర్ఎస్,బీజేపీ ఒక్కటేనని మరోసారి రుజువైందన్నారు కాంగ్రస్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. అమిత్ షా సభకు ప్రభుత్వం వెయ్యిబస్సులు పంపించిందన్నారు.  దుబ్బాకలో మాట్లాడాని పొంగులేటి.. తాను కాంగ్రెస్ లో చేరినప్పడు అడుగడుగునా అడ్డంకులు సృష్టించిన బీఆర్ఎస్ ప్రభుత్వం అమిత్ షా సభకు సహకరించిందని ఆరోపించారు. బీఆర్ఎస్, బీజేపీ మధ్య సహకారంతో వాళ్ల మధ్య ఉన్న ఫెవికాల్ బంధం బయటపడిందన్నారు.బీజేపీ,బీఆర్ఎస్, ప్రత్యక్షంగా,పరోక్షంగా కాంగ్రెస్ పై యుద్ధం చేస్తున్నాయని విమర్శించారు. 
 
ధరణి పేరుతో ప్రభుత్వం లక్షల కోట్ల విలువైన భూములు దోచుకుందని..అధికారంలోకి రాగానే వాటిని స్వాధీనం చేసుకుంటామన్నారు పొంగులేటి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బెల్టు షాపులు మూత పడడం ఖాయమని చెప్పారు.  దుబ్బాకను 20 ఏళ్ల క్రితం అభివృద్ధి చేసిన ఘనత చెరుకు ముత్యంరెడ్డికి చెందుతున్నారు.  2014, 2018 మేనిఫెస్టోలో ఎన్ని అమలు చేశారో కెసిఆర్ చెప్పాలని సవాల్ విసిరారు.  కాంగ్రెస్ ను  ఆశీర్వదించి చెరుకు శ్రీనివాస్ రెడ్డి ని ఎమ్మెల్యే గా గెలిపించాలని కోరారు.