దమ్ముంటే నన్ను సస్పెండ్ చేయండి: పొంగులేటి శ్రీనివాస్

దమ్ముంటే నన్ను సస్పెండ్ చేయండి: పొంగులేటి శ్రీనివాస్

బీఆర్ఎస్‌పై మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వైరా నియోజకవర్గంలో తన అనుచరులను సస్పెండ్ చేయడంపై ఘాటుగా స్పందించారు. సస్పెండ్ చేయాల్సి వస్తే తనను చేయాలి గానీ, తన అనుచరులను కాదని మండిపడ్డారు. తనను కాకుల్లా , గద్దల్లా పొడుచుకుతినాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. దమ్ముంటే అనుచరులను కాదు తననే సస్పెండ్ చేయాలని సవాల్ విసిరారు. అధికారం ఎప్పుడూ ఒకరి చేతిలోనే ఉండదని.. ఎవ్వరినైనా ఇబ్బంది పెడితే వడ్డీ కాదు చక్రవడ్డీతో సహా తిరిగి చెల్లిస్తానని పొంగులేటి శ్రీనివాస్ అన్నారు.

ఒక ప్రజా ప్రతినిధి తన గురించి తన కాంట్రాక్టుల గురించి మాట్లాడడాన్ని పొంగులేటి తప్పుబట్టారు. కాంట్రాక్టులపై ఎక్కడైనా చర్చకు సిద్ధమన్నారు. తనపై కుయుక్తులు, కుట్రలు పన్నుతున్న వారికి ప్రజలే బుద్ధి చెబుతారని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రత్యేక తెలంగాణను ఎలా సాధించుకున్నామో గుర్తు తెచ్చుకోవాలన్నారు.